• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అల్లూరి జిల్లా : మినుములూరు పీహెచ్‌సీలో పోషణ పక్వాడ

ASR: పాడేరు మండలంలోని మినుములూరు పీహెచ్‌సీలో శనివారం 8వ పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా పీహెచ్‌సీ వైద్యాధికారి మనోజ్ణ, ఐసీడీఎస్ సీడీపీవో శారదాదేవి గర్భిణిలు, బాలింతలకు పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి అవగాహన కల్పించారు. జంక్ ఫుడ్ తినడం వల్ల, పిల్లలకు పెట్టడం వల్ల కలిగే అనర్ధాల గురించి వివరించారు. పౌష్టికాహారం తీసుకోవాలన్నారు.

April 18, 2026 / 06:38 PM IST

కొరిశపాడులో పోషణ్ పక్వాడ కార్యక్రమం

BPT: కొరిశపాడు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో శనివారం పోషణ్ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీవో ఎలిజిబెత్ రాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగాగ ఆమె పోషణ్ పక్వాడ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని గురించి బాలింతలు, గర్భిణీ స్త్రీలకు వివరించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం ద్వారా చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారని రాణి చెప్పారు.

April 18, 2026 / 06:34 PM IST

బనగానపల్లెలో అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్

NDL: బనగానపల్లె పట్టణంలో ఇవాళ పీట్ల గంగాధర్ అనే అంతర్రాష్ట్ర దొంగను బనగానపల్లె పోలీసులు అరెస్టు చేశారు. గంగాధర్ స్వగ్రామం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంగా పోలీసులు గుర్తించారు. ఇటీవల ఓంశాంతి నగర్‌లో నివాసముంటున్న ఉపాధ్యాయుడు నాగరాజు ఇంట్లో గంగాధర్ 20 తులాల బంగారం నగదును దోచుకెళ్లాడు. దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు తెలిపారు.

April 18, 2026 / 06:33 PM IST

బసాపురం ట్యాంకును పరిశీలించిన వైసీపీ నేతలు

KRNL: ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ నేతలు ఇవాళ బసాపురం ఎస్.ఎస్. ట్యాంకును పరిశీలించారు. ట్యాంకులో ఉన్న నీటి నిల్వలు పట్టణానికి మూడు నెలలు సరిపోతాయని తెలిపారు. నీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. కెనాల్ నీరు కొత్తగా వచ్చినందున ప్రజలు నీటిని మరిగించి తాగాలని విజ్ఞప్తి చేశారు.

April 18, 2026 / 06:31 PM IST

అగ్నిప్రమాదాలపై కార్మికులకు అవగాహన కార్యక్రమం

W.G: పాలకొల్లు అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు, డెమోలు నిర్వహించారు. సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి వై.వి. జానకిరామ్ పర్యవేక్షణలో సిబ్బంది ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చారు. పరిశ్రమల్లో అమ్మోనియా వాయువు లీకైనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణనష్టం జరగకుండా బాధితులను రక్షించే విధానాలను కార్మికులకు వివరించారు.

April 18, 2026 / 06:30 PM IST

హైస్కూల్‌లో “నో బ్యాగ్ డే”

PLD: పెదకూరపాడు మండలం 75- త్యాళ్ళూరు పీఎం శ్రీ హైస్కూల్‌లో ఈ విద్యా సంవత్సరపు చివరి “నో బ్యాగ్ డే” శనివారం ఘనంగా ముగిసింది. విద్యార్థులపై పుస్తకాల భారాన్ని తగ్గించి, అభ్యాసాన్ని సరదాగా, నైపుణ్య ఆధారితంగా మార్చేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది. ఈ ముగింపు వేడుకలో హెచ్‌ఎం శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వివిధ కృత్యాలు నిర్వహించారు.

April 18, 2026 / 06:30 PM IST

ప్రమాదాల నివారణే లక్ష్యం: ఏసీపీ

NTR: విజయవాడలోని అయోధ్య నగర్ ప్రాంతంలో ఉన్న బ్లాక్ స్పాట్‌ను శనివారం ట్రాఫిక్ ఏసీపీ శ్రీవేద పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయించారు. ప్రమాదాల తీవ్రత అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మార్గంలో వాహన చోదకులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

April 18, 2026 / 06:30 PM IST

బ‌డి ఈడు పిల్ల‌ల్ని బ‌డిలో చేర్పిద్దాం: కలెక్టర్

NTR: జిల్లా కలెక్టర్ జి.లక్ష్మీశ కొండపల్లి బొమ్మల పండుగ వేదికగా ‘బడి పిలుస్తుంది’ ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. బడి ఈడు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి విద్యాభ్యాసం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యా రంగానికి పెద్దపీట వేస్తోందన్నారు. చదువుకు ఎవరూ దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

April 18, 2026 / 06:30 PM IST

పోషకాహారంతో సంపూర్ణ ఆరోగ్యం: CDPO

KDP: సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని కడప అర్బన్ ICDS, CDPO శోభారాణి పేర్కొన్నారు. ఇవాళ సిద్ధవటంలోని MPDO కార్యాలయ సభా భవనంలో ‘పోషణ పక్వాడ’ కార్యక్రమంలో భాగంగా గర్భవతులకు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా CDPO మాట్లాడుతూ.. శిశువులు, గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు సరైన పోషకాహారం అందించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.

April 18, 2026 / 06:30 PM IST

జల హారతి వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

ప్రకాశం: కొమరోలు మండలం రాజుపాలెం గ్రామంలో శనివారం ‘జల హారతి’ మహోత్సవంలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు చెరువు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ గంగమ్మ తల్లి దేవాలయంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చెరువు వద్ద గంగమ్మ తల్లికి పసుపు, కుంకుమలు సమర్పించి, భక్తిశ్రద్ధలతో జల హారతి ఇచ్చారు.

April 18, 2026 / 06:30 PM IST

వార్డు స్థాయిలో వైసీపీ అత్యవసర సమావేశం

VSP: విశాఖలోని 10వ వార్డు కార్యాలయంలో వైసీపీ బూత్ లెవల్ ఏజెంట్లు, ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా మహిళా అధ్యక్షురాలు పేడాడ రమణి కుమారి పాల్గొని కమిటీల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని సూచించారు. కార్డు వెరిఫికేషన్ పూర్తి చేసిన వారికి త్వరలోనే కార్డులు అందుతాయని తెలిపారు.

April 18, 2026 / 06:26 PM IST

ఇష్టపడి చదివితే ఎంతటి విజయాన్నయినా సాధించొచ్చు.

PPM: ఇష్టపడి చదివితే ఎంతటి ఫలితాలనయినా సాధించొచ్చని సాయిఅమృత నిరూపించిందని, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. ఇటీవల వెలువడిన ఇంటర్ మీడియట్ ఫలితాల్లో పార్వతీపురం పట్టణానికి చెందిన బెలగాం సాయిఅమృత 1000 మార్కులకు 987 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. ఈ మేరకు సాయిఅమృతను పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర సన్మానం చేశారు.

April 18, 2026 / 06:26 PM IST

‘మహిళ లక్షణం కోసం శక్తి టీం సిద్ధంగా ఉంటుంది’

VZM: మహిళల రక్షణ కోసం శక్తి టీం సిద్ధంగా ఉంటుందని గజపతినగరం సీఐ జీఏవి రమణ అన్నారు. శనివారం గజపతినగరంలోని శ్రీనివాస కన్వెన్షన్‌లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు మహిళా సాధికారతలో భాగంగా పలు అంశాలపై అవగాహన సదస్సు జరిగింది. లైంగిక దాడులు గృహహింస చిన్నపిల్లల పట్ల జరుగుతున్న అకృత్యాలు ఈ విటీజింగ్ సైబర్ నేరాలుపై అవగాహన కల్పించారు.

April 18, 2026 / 06:25 PM IST

డ్రైనేజీ గుంతలో పడిన కారు తప్పిన ప్రమాదం

KKD: సామర్లకోట-పిఠాపురం రోడ్డులో పరమేశ్వరి మెడికల్ షాప్ సమీపాన ఇవాళ సాయంత్రం డ్రైనేజీ కాలువలో కారు పడిన ఘటన చోటుచేసుకుంది. హెవీ వాహనం డ్రైనేజీపై వెళ్లడంతో స్లాబ్ పగిలి పెద్ద గొయ్యి ఏర్పడింది. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాలేదు. స్లాబ్ పగిలి దాదాపు పది రోజులు గడిచినా అధికారులు పట్టించుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

April 18, 2026 / 06:24 PM IST

తిరుపతిలో నకిలీ మెడికల్ సర్టిఫికెట్ల కలకలం

తిరుపతిలో నకిలీ మెడికల్ ఇన్వాలిడేషన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. తనపల్లికి చెందిన జయమ్మకు అనారోగ్య సమస్యలు ఉన్నట్లు ఆమె కుమారుడు చక్రపాణి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి, తప్పుడు మార్గంలో ప్రభుత్వ ఉద్యోగం పొందారని చంద్రలేఖ అనే మహిళ ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం చక్రపాణి తిరుచానూరులో రెవెన్యూ ప్రోటోకాల్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

April 18, 2026 / 06:21 PM IST