• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

SS: పెనుకొండ డివిజన్ పరిధిలోని మూడు ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీ ఆయా పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మహిళాా శిశు సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. సోమందేపల్లిలో 49, పెనుకొండలో 16, హిందూపురంలో 36 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి గలవారు ఈ నెల 20లోపు ఐసీడీఎస్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

April 12, 2026 / 04:52 PM IST

విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టర్

E.G: గోకవరం (M) రంపయర్రంపాలెం గ్రామంలో ఆదివారం సాయంత్రం వేగంగా వచ్చిన ట్రాక్టరు రెండు విద్యుత్ స్తంభాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు స్తంభాలు నేలకొరిగాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న లైన్‌మెన్ వెంటనే ట్రాన్స్‌ఫార్మర్ నిలిపివేసి పెను ప్రమాదాన్ని తప్పించారు.

April 12, 2026 / 04:52 PM IST

‘మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి’

పల్నాడు కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికతో పాటు రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. ప్రజలు తమ ఫిర్యాదుల కోసం కలెక్టరేట్‌కు రావడం కట్టమైతే, ఇంటి నుంచే మీకోసం కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోవచ్చని సూచించారు. 1100 నంబర్‌కు ఫోన్ చేసి లేదా Meekosam.ap.gov.in ద్వారా తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.

April 12, 2026 / 04:50 PM IST

ఈ నెల 27 నుంచి ఉచిత కంప్యూటర్ శిక్షణ

కడపలోని బాలోత్సవం కమిటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నారు. SV. ఇంజనీరింగ్ కాలేజీ, బాలాజీ నగర్‌లో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు ఏప్రిల్ 27 నుంచి మే 16 వరకు కంప్యూటర్ శిక్షణతో పాటు డ్రాయింగ్, డాన్స్, మ్యాజిక్, పాటలు వంటి వినోద కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.

April 12, 2026 / 04:47 PM IST

పేకాట శిబిరంపై దాడి.. 8 మంది అరెస్ట్

ప్రకాశం: కొండపి (M) నేతివారి పాలెం పంట పొలాల్లో పేకాట శిబిరంపై ఆదివారం స్థానిక పోలీసులు దాడి చేసి 8 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 49,320, 8 బైకులు, 7 మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. చట్ట వ్యతిరేక కార్యకాలానికి ఎవరు పాల్పడిన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై త్యాగరాజు హెచ్చరించారు.

April 12, 2026 / 04:46 PM IST

ఇంటర్ ఫలితాలలో సత్తా చాటిన గుంతకల్ విద్యార్థి

ATP: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్ష ఫలితాల్లో గుంతకల్లు మండలం గొల్లల దొడ్డి గ్రామానికి చెందిన గోపాలకృష్ణ అనే కిరాణా వ్యాపారి కుమారుడు ఆర్.మధు అత్యంత ప్రతిభ కనబరిచారు. మొత్తం 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించాడు. కుమారుడు విజయం సాధించడంతో తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.

April 12, 2026 / 04:43 PM IST

భీమవరంలో అగ్ని ప్రమాదం

W.G: భీమవరం పట్టణంలోని అంబేడ్కర్ సర్కిల్లో యనమదుర్రు ట్రైన్ వంతెన కింద ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక శకటంతో పాటు సిబ్బంది చేరుకొని మంటలను నియంత్రణలోకి తెచ్చారు. అగ్నికీలలు చెలరేగడంతో ఆ ప్రాంతమంతా దట్టంగా పొగ వ్యాపించింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

April 12, 2026 / 04:38 PM IST

అప్పులున్నా పథకాలు అమలు : మంత్రి

KKD: అన్నవరంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం భారీ అప్పులను వారసత్వంగా ఇచ్చిందని విమర్శించారు. ఆ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్ర ఆదాయంలో 94 శాతం ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతున్నా, ఆర్థిక సంక్షోభాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని వెల్లడించారు.

April 12, 2026 / 04:35 PM IST

విద్యార్థుల విద్యాభివృద్ధికి దాతలు చేయూతనివ్వాలి: MLC

ELR: పేద విద్యార్ధుల విద్యాభివృద్ధికి దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సాయం చేసి చేయూతనివ్వాలని MLC జయమంగళ వెంకటరమణ తెలిపారు. ఓ ట్రస్ట్ ఛైర్మన్ అట్లూరి భవాని ప్రసాద్ ఆర్థిక సహకారంతో మండలంలోని పులపర్రుకు చెందిన బీటెక్ విద్యార్ధిని జాహ్నవికి MLC జయమంగళ వెంకటరమణ లాప్ టాప్ బహుకరించారు. విద్యార్ధులు, గ్రామస్థులకు సేవా కార్యక్రమాలు చేయటం అభినందనీయమన్నారు.

April 12, 2026 / 04:33 PM IST

‘సేంద్రీయ వ్యవసాయమే ఆరోగ్యానికి రక్షణ’

SKLM: రసాయన ఎరువులు వాడకం వల్ల అనారోగ్య సమస్యలు పెరుగుతున్నాయని, సేంద్రియ వ్యవసాయమే ఆరోగ్యానికి రక్షణ అని ధరణిపుత్ర ఆర్గానిక్స్ డెవలప్మెంట్ ఫార్మర్స్ సొసైటీ ఛైర్మన్ ఉమామహేశ్వరరావు అన్నారు. నరసన్నపేటలో ఆయన మాట్లాడుతూ.. రసాయన రహిత వ్యవసాయం, జీవామృతం, ఘన జీవామృతం వంటి పద్ధతులను అవలంబించాలని రైతులకు సూచించారు.

April 12, 2026 / 04:30 PM IST

‘హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటాం’

VZM: జిల్లా పోలీసు శాఖలో డీ.సీ.ఆర్.బీ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేస్తూ, గుండె పోటుతో ఆకస్మికంగా మరణించిన ఎ. జగదీశ్వర రావు భౌతికకాయాన్ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ సందర్శించారు. అనంతరం పూలమాల వేసి, నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. రూ.లక్ష కుటుంబ సభ్యులకు అర్థిక సహాయం అందించారు.

April 12, 2026 / 04:30 PM IST

వట్టిచెరుకూరులో అద్దంకమ్మ అమ్మవారి తిరునాళ్లు

GNTR: వట్టిచెరుకూరు మండల కేంద్రంలోని అద్దంకమ్మ అమ్మవారి దేవాలయంలో తిరునాళ్ల మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆదివారం అమ్మవారిని లక్ష గాజులతో అలంకరించగా భక్తులు భారీగా తరలి వచ్చి దర్శనం చేసుకున్నారు. గ్రామంలోని మహిళలు పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు.

April 12, 2026 / 04:27 PM IST

కారంపూడిలో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

PLD: కారంపూడి మండల కేంద్రంలోని టూ టౌన్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. వేసవి తీవ్రత దృష్ట్యా ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడం ముఖ్యమని పేర్కొంటూ.. ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

April 12, 2026 / 04:25 PM IST

పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మంత్రి

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి క్షేత్రంలో ఇవాళ రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఆలయ సమీపంలో 5.8 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పలు అభివృద్ధి పనులకు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి భూమి పూజ చేశారు. అనంతరం భక్తుల కోసం నిత్యన్నదాన సత్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 12, 2026 / 04:24 PM IST

‘పశువులను మేపే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

ఏలూరు జిల్లా పోలవరంలోకి ప్రవేశించిన పెద్దపులి జాడలను అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. రేడియో ట్రాకింగ్ ద్వారా దాని గమనాన్ని పరిశీలిస్తున్నారు. ఒంటరిగా అటవీ ప్రాంతంలో ప్రజలు సంచరించవద్దని , పొలాల్లో పశువులు మేపే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. పెద్దపులి గమనానికి చెందిన ట్రాకింగ్ చిత్రాలను విడుదల చేశారు.

April 12, 2026 / 04:24 PM IST