• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంట్‌ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కోనసీమ: మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు గురువారం రాయవరం మండలంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. మండల పరిషత్ కార్యాలయంలో రూ.4.75 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో ఏర్పాటు చేసిన 10 కిలోవాట్ల సోలార్ రూఫ్ టాప్ పవర్ ప్లాంటు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నావుడు వెంకటరమణ, TDP నేతలు ఉండవెల్లి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

April 9, 2026 / 05:50 PM IST

‘పంచాయతీ ఎన్నికలలో గెలుపు కృషి చేయాలి’

ELR: దెందులూరు నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కార్యాలయంలో పలువురు నేతలతో హోంమంత్రి అనిత భేటీ అయ్యారు. నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులపై వారితో సమీక్షించారు. నియోజవర్గంలో పార్టీకి అంకితభావంతో పనిచేసే నేతలు ఉండడం ఎంతో గర్వకారణం అని అన్నారు. ఇదే స్ఫూర్తితో పంచాయతీ , ఎన్నికలలో గెలుపు కోసం పరిచేయాలన్నారు.

April 9, 2026 / 05:50 PM IST

‘నీటి సంరక్షణకు 100 రోజుల చర్యలు’

KRNL: జిల్లాలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం 100 రోజుల కార్యక్రమాన్ని కలెక్టర్ డా.సిరి గురువారం ప్రారంభించారు. కోసిగి మండలం డి.బెలగల్‌లో చెక్‌డ్యామ్, నాగమ్మ చెరువును పరిశీలించి వాగులు, వంకల అడ్డంకులు తొలగించాలని ఆదేశించారు. భూగర్భ జలమట్టాన్ని 6.6 మీటర్ల నుంచి 4 మీటర్ల లోపు తగ్గించడమే లక్ష్యమని, 246 చెరువులు పునరుద్ధరిస్తామని కలెక్టర్ తెలిపారు.

April 9, 2026 / 05:46 PM IST

రోడ్డు ప్రమాదాలు నివారించాలి

CTR: చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో రవాణా శాఖ ఆధ్వర్యంలో రోడ్డు భద్రతా కమిటీ సమావేశం గురువారం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు సమిష్టి కృషితో పాటు.. అవగాహన కల్పించాలని కోరారు.

April 9, 2026 / 05:41 PM IST

‘సూర్యఘర్ సోలార్ పనులు వేగవంతం చేయాలి’

KDP: మైదుకూరు విద్యుత్ కార్యాలయంలో ఎస్ఈ శ్రీనివాసులు అధ్యక్షతన గురువారం సమీక్షా సమావేశం జరిగింది. పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై చేపట్టిన సోలార్ పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వేసవిలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని, పగటిపూట వీధిలైట్లు వెలగకుండా నివారించాలని, గ్రామాల్లో విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.

April 9, 2026 / 05:40 PM IST

33 ప్రధాన ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు: కమిషనర్

NLR: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగర వ్యాప్తంగా 33 ప్రధాన ప్రాంతాలలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ నందన్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలంతా వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను పాటించి, అవసరమైన సమయాల్లో మాత్రమే బహిరంగ ప్రదేశాలలో తిరగాలన్నారు. అత్యవసర సమయాల్లో నిర్దేశించిన రక్షణ ఉపకరణాలను తప్పనిసరిగా ఉపయోగించాలని సూచించారు.

April 9, 2026 / 05:40 PM IST

రాయచోటిలో సెమినార్‌కు ప్రత్యేక ఆకర్షణ

అన్నమయ్య: శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెంటర్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏసియన్ అండ్ పసిఫిక్ స్టడీస్ (సీప్) స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాయచోటికి చెందిన పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, మోటకట్ల హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పద్మజలు ఏప్రిల్ 6 నుంచి 8 వరకు జరిగిన అంతర్జాతీయ సెమినార్‌లో హాజరయ్యారు.

April 9, 2026 / 05:35 PM IST

రీ సర్వేను పరిశీలించిన ఆర్డీవో ఆనంద్ కుమార్

సత్యసాయి: గుడిబండ మండలంలలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్ పర్యటించారు. మండలంలోని చిగాతుర్పి గ్రామంలో జరుగుతున్న రీ సర్వేను రైతుల సమక్షంలో పరిశీలించారు. అనంతరం సర్వేయర్లతో మాట్లాడుతూ.. ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా సర్వే చేయాలన్నారు. రైతులకు రీసర్వే గురించి వివరించారు.

April 9, 2026 / 05:30 PM IST

‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే

E.G: గోకవరం మండలంలోని అచ్చుతాపురంలో గురువారం ‘మీ భూమి-మీ హక్కు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగ్గంపేట MLA నెహ్రూ ముఖ్యఅతిథిగా హాజరై 943 మంది లబ్ధిదారులకు నూతన పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్నా హక్కులు లేని భూములకు, కూటమి ప్రభుత్వం పట్టాలిచ్చి భరోసా కల్పించిందన్నారు.

April 9, 2026 / 05:30 PM IST

‘ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ కొత్త నాటకం’

కోనసీమ: అమరావతి రాజధానిపై కేంద్రం గుర్తింపు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే జగన్ కొత్త నాటకాలకు తెరతీశారని కొత్తపేట మండల టీడీపీ నాయకులు ఆరోపించారు. గురువారం కొత్తపేట టీడీపీ కార్యాలయంలో వారు మాట్లాడారు. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదన్నారు. నైతిక హక్కును ఎప్పుడో కోల్పోయిందన్నారు.

April 9, 2026 / 05:30 PM IST

కార్యకర్తలతో మాజీ మంత్రి శైలజనాథ్ సమావేశం

ATP: శింగనమలలో వైసీపీ నాయకులు, కార్యకర్తలతో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ముఖాముఖి సమావేశం నిర్వహించారు. పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ఐక్యంగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తులో అన్ని సమస్యలను పరిష్కరిస్తామని, కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేయాలని కార్యకర్తలకు సూచించారు.

April 9, 2026 / 05:30 PM IST

ధాన్యం కొనుగోలుపై కలెక్టర్ సమీక్ష సమావేశం

W.G: రెవెన్యూ, పౌరసరఫరాలు, రవాణా, కోఆపరేటివ్ శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై గురువారం జిల్లా జేసీ రాహుల్ కుమార్ గూగుల్ మీట్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఏప్రిల్, మే నెలలు రబీ సీజన్‌కు కీలకమని ఈ కాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి కేంద్రంలో కనీసం 50 శాతం గోనె సంచులు సిద్ధం చేయాలని కోరారు.

April 9, 2026 / 05:28 PM IST

బాల్య వివాహాల నిర్మూలనకు ప్రచార రథం

KRNL: వెల్దుర్తి, కృష్ణగిరి మండలాల్లో బాల్య వివాహాలు, కౌమార గర్భాల నివారణ కోసం ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇవాళ “బాల్య వివాహ విముక్తి ప్రచార రథం” కార్యక్రమం నిర్వహించారు. కళాజాత బృందాలు పాటలు, నాటికల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాయి. ICDS పద్మావతి, సరస్వతి పలువురు “బేటీ బచావో – బేటీ పడావో” సందేశంతో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు.

April 9, 2026 / 05:27 PM IST

సమస్యల పరిష్కారమే ధ్యేయం: శ్రీనివాసరాజు

CTR: న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో తమవంతు సహకారం ఉంటుందని రాష్ట్ర బార్ కౌన్సిల్ మెంబర్ ఉప్పలపాటి శ్రీనివాసరాజు పేర్కొన్నారు. గురువారం ఆయన పుంగనూరుకు రాగా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. స్థానికంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

April 9, 2026 / 05:26 PM IST

జనాభా గణనకు సిద్ధం.. మే 1 నుంచి హౌస్ లిస్టింగ్

GNTR: తెనాలి మండలంలో జనాభా గణనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎమ్మార్వో గోపాలకృష్ణ తెలిపారు. మే 1–30 వరకు హౌస్ లిస్టింగ్, ఏప్రిల్ 16–30 వరకు స్వచ్ఛంద నమోదు అవకాశం కల్పించారు. జనాభా గణనకు ప్రజలు భయపడకుండా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

April 9, 2026 / 05:25 PM IST