కడప: గండికోట జలాశయం నుంచి మైలవరం జలాశయానికి విడుదల చేస్తున్న నీటిని అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారులు నిర్ణయించిన 2 TMC నీరు ఇప్పటికే మైలవరం జలాశయానికి చేరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మైలవరం EE రమేశ్ తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయం నుంచి ఉత్తర కాలువకు 300 క్యూసెక్కులు, దక్షిణ కాలువకు 160 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కాగా జలాశయంలో 3.3 TMC నీరు నిల్వ ఉంది.
కోనసీమ: అమలాపురం పట్టణంలో వరుస బైక్ దొంగతనాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి చోరీలకు పాల్పడుతున్న వ్యక్తి ఆచూకీ తెలపాలని క్రైమ్ పార్టీ ఎస్సై అయితా బత్తుల బాలకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా దొంగకు సంబంధించిన ఫోటోలను గురువారం ఆయన మీడియాకు విడుదల చేశారు. ఇటీవల అమలాపురం కిమ్స్ హాస్పిటల్ వద్ద ఈ వ్యక్తి బైక్ దొంగతనం చేసిన ఆధారాలు లభించాయన్నారు.
VSP: గాజువాక సాయిరాం నగర్‌లోని స్వామి విద్యానికేతన్ హై స్కూల్‌లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో ‘డే హైక్’ కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 5 గం నుంచి సా. 6 గం వరకు సాగిన ఈ సాహసయాత్రలో విద్యార్థులు వివిధ శిక్షణా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.హైక్‌లో భాగంగా అల్పాహారం నుంచి భోజనం వరకు విద్యార్థులే వంటలు తయారు చేసుకుని తమ స్వయంకృషిని చాటుకున్నారు.
AKP: విశాఖ ఉక్కు కర్మాగారం 2025-26లో గణనీయ వృద్ధిని నమోదు చేసింది. కీలక ఉత్పత్తి విభాగాల్లో 52% పెరుగుదల సాధించింది. హాట్ మెటల్ ఉత్పత్తి 5.95 మిలియన్ టన్నులకు, లిక్విడ్ స్టీల్ 5.69 మిలియన్ టన్నులకు చేరాయి. క్రూడ్ స్టీల్ 5.43 మిలియన్ టన్నులతో 51% వృద్ధి నమోదు చేసింది. టర్నోవర్ రూ.22,311 కోట్లకు చేరి 22% పెరిగింది.
TPT: చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా చేయు G.O ఇచ్చిన సందర్భంగా, ప్రభుత్వానికి ధన్యవాదలు తెలుపుతూ, చంద్రబాబు చిత్ర పటానికి గురువారం నారాయణవనం మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, మరమగ్గ కార్మికులు, మొదలియార్ సంఘం నాయకులు పాలాభిషేకం చేయడం జరిగింది.
CTR: చిత్తూరు కలెక్టర్ కార్యాలయ సమీపంలోని కాఫీ దుకాణం వద్ద ఓ యువకుడు ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసుల వివరాల మేరకు.. పులిచెర్ల మండలానికి చెందిన మోహన్ (28) కుటుంబ కలహాల కారణంగా పురుగుల మందు తాగాడు. పోలీసులు వెంటనే స్పందించి 108లో చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
KKD: కోరుకొండలో శ్రీ సీతారాముల ఆలయ పునఃప్రతిష్ట మహోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ బత్తుల వెంకటలక్ష్మి పాల్గొని సీతారాముల వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. సీతారాముల వారి ఆశీస్సులతో ప్రజల సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ELR: ఐదు సంవత్సరాల పాలనలో అందరి సహకారంతో అభివృద్ధి చేశానని సర్పంచ్ దిడ్ల అలకనంద శ్రీనివాస్ అన్నారు. గురువారం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామపంచాయతీ పాలకవర్గం పూర్తి కావడంతో పంచాయితీ అభివృద్ధి అధికారి విజయ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, పంచాయితీ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
PPM: ఆంధ్రరాష్ట్ర రాజధాని అమరావతి అని చెప్పేందుకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర అన్నారు. పార్వతీపురంలో TDP కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 26 జిల్లాలకు ఒక ఉపాధి కల్పనగా, కల్పతరువుగా, ఆర్థిక శక్తిగా, ఒక క్వాంటం వ్యాలీసిటీగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. అన్ని పార్టీలు అమరావతి రాజధానికి పార్లమెంటులో తమ మద్దతు తెలిపాయి అన్నారు.
CTR: పూతలపట్టు మండలం కొత్తకోట సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల మేరకు.. చిత్తూరు వైపు నుంచి తిరుపతి వైపు కారు బయల్దేరింది. అతివేగంతో డివైడర్‌ను ఢీకొట్టి చిత్తూరు వైపు దారిలో వచ్చి బోల్తా పడింది. కారులో ఉన్నవారికి ఎటువంటి గాయాలు కాలేదు.
కడప: ఒంటిమిట్ట కోదండ రాముని కళ్యాణంలో పాల్గొనేందుకు జిల్లాకు విచ్చేసిన CM చంద్రబాబు తన పర్యటనను ముగించుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. రామయ్య కళ్యాణం ముగిసిన అనంతరం ఒంటిమిట్టలో ఆయన రాత్రి బస చేశారు. నేడు ఉదయం ఒంటిమిట్టలోని హెలిపాడ్ వద్ద నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లారు. ఆయనకు కలెక్టర్ శ్రీధర్, DIG కోయ ప్రవీణ్ వీడ్కోలు పలికారు.
ఏలూరు జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా బాధ్యతలు స్వీకరించిన పి. జగదాంబ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఛైర్‌పర్సన్ పి. జగదాంబకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు.
PLD: ఆంధ్ర, తెలంగాణ సరిహద్దులో అద్దంకి నార్కెట్ పల్లి హైవేపై ఉన్న దాచేపల్లి బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో నిరుపయోగంగా మారింది. బస్టాండ్ నిర్మించి 20 సంవత్సరాలు అవుతున్నప్పటికీ పూర్తిస్థాయి ఉపయోగంలోకి రాలేదు. బస్టాండ్‌లోకి బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు రోడ్డుమీద ఎండకు ఎండుతూ బస్సుల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ELR: నూజివీడు బార్ అసోసియేషన్ నూతన కమిటీ గురువారం బాధ్యతలు చేపట్టింది. అధ్యక్షునిగా ఇందుపల్లి సత్య ప్రకాష్, వైస్ ప్రెసిడెంట్ రాణి మేకల సత్యనారాయణ, సెక్రటరీ యామలపల్లి హరిబాబు, జాయింట్ సెక్రెటరీ చింత తేజా చంద్, ట్రెజరర్ అక్కినేని రమాకుమారి, లైబ్రేరియన్ రామినేని రామకృష్ణలు బాధ్యతలు చేపట్టారు. న్యాయవాదులు, కక్షిదారుల సేవకు సిద్ధంగా ఉన్నామన్నారు.