• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

గుంటూరులో టీ-20 క్రికెట్ ట్రయల్స్.. ఈ నెల 5న నిర్వహణ

గుంటూరులో టీ-20 సీనియర్ బాలుర క్రికెట్ ఎంపికలు జరగనున్నాయి. GDCA ఆధ్వర్యంలో ఏప్రిల్ 5న ట్రయల్స్ నిర్వహిస్తారు. అరండల్‌పేట మాజేటి గురవయ్య మైదానంలో ఈ కార్యక్రమం ఉంటుంది. ఉదయం 7.30 గంటలకు హాజరు కావాలి. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సొంత కిట్, కలర్ డ్రెస్‌తో రావాలి. ఆధార్, డిజిటల్ జనన ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని నిర్వాహకులు తెలిపారు.

April 2, 2026 / 09:57 AM IST

94 శాతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ

CTR: జిల్లా వ్యాప్తంగా బుధవారం 94.43 శాతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,32,880 మందికి గాను తొలి రోజున 2,19,906 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారన్నారు. మిగిలిన 12,974 మందికి గురువారం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

April 2, 2026 / 09:52 AM IST

150 నర్సు పోస్టులకు 7,500 అప్లికేషన్లు..!

GNTR: పిడుగురాళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సు నియామకాలకు భారీగా స్పందన వచ్చింది. మొత్తం 150 ఖాళీలకు 7,500 దరఖాస్తులు చేరాయి. మార్చి 31తో అప్లికేషన్ ప్రక్రియ ముగిసింది. స్క్రూటినీ పూర్తి చేసి మెరిట్, రిజర్వేషన్ ప్రకారం ఎంపిక చేపడతామని అధికారులు తెలిపారు. ఉద్యోగాల పేరుతో మోసాలకు దూరంగా ఉండాలని అధికారులు సూచించారు.

April 2, 2026 / 09:51 AM IST

అధికారుల లోపం ఆర్టీసీ డ్రైవర్లు ఇస్టారాజ్యం

VZM: ఎస్.కోట నుంచి విశాఖ వెళ్లే బస్సులు కొత్తవలస ప్రధాన బస్ స్టాప్ వద్ద ఆపకుండా నేరుగా వెళ్లిపోతున్నాయి. ఉదయంపూట విశాఖకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఎస్.కోట డిపో కు చెందిన బస్సులు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఫ్రీ బస్సులు వచ్చిన తరువాత ఈ దుస్థితి ఎదురవుతుందని ప్రయాణికులు వాపోతున్నారు.

April 2, 2026 / 09:49 AM IST

హత్యాయత్నం కేసులో ముగ్గురు అరెస్ట్

TPT: శ్రీకాళహస్తిలోని శీతాలాంబ గుడి వద్ద ఈనెల 21వ తేదీన మార్కెట్ యార్డు అటెండర్ బాలకృష్ణపై దాడి జరిగింది. ఐదు మంది దాడికి ప్రయత్నించగా వారిలో ముని జయ కృష్ణ ప్రసాద్, హిదాయత్ గతంలో అరెస్టు చేశారు. మిగతా ముగ్గురు మహేశ్, సోమశేఖర్, నాగరాజును బుధవారం అదుపులోకి తీసుకున్నారు. బైకు స్వాధీనం చేసుకున్నట్లు టూ టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.

April 2, 2026 / 09:49 AM IST

‘ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చర్యలు తప్పవు’

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో రోడ్లపై భవన నిర్మాణ సామాగ్రిని వేసి ప్రమాదాలకు కారణమయ్యే వారిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ వై.ఓ నందన్ హెచ్చరించారు. ఇసుక, కంకర వంటివి తరలించే సమయంలో వాహన యజమానులు తప్పనిసరిగా నగరపాలక సంస్థ నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను పాటించాలన్నారు. లేని యడల వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

April 2, 2026 / 09:42 AM IST

ఆ గ్రామంలో 50 ఏళ్ల తర్వాత పెద్దమ్మ తల్లి దేవర

కడప: జమ్మలమడుగులోని పొన్నతోట గ్రామం ఒక అరుదైన ఆధ్యాత్మిక ఘట్టానికి వేదిక కాబోతోంది. సుమారు 50 ఏళ్ల తర్వాత శ్రీ పెద్దమ్మతల్లి దేవర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. వచ్చే మే నెల 2, 3 తేదీలలో ఈ వేడుకలు జరగనున్నాయి. మొదటగా 1964, 1976లో జరగగా ప్రస్తుతం 2026 సంవత్సరంలో జరగనుంది. ఈ దేవరకు జనం భారీ సంఖ్యలో హాజరు కానున్నారు.

April 2, 2026 / 09:39 AM IST

నేడు పట్టుబడిన వాహనాలకు వేలం

E.G: రంగంపేట ప్రొహిబిషన్ & ఎక్సైజ్ స్టేషన్‌లో వివిధ ఎక్సైజ్ నేరాలతో పట్టుబడిన మూడు ద్విచక్ర వాహనాలకు గురువారం ఎక్సైజ్ స్టేషన్‌లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నామని ఎక్సైజ్ సీఐ డి.సుధ ఒక ప్రకటనలో తెలిపారు. రాజమండ్రి ఆర్టీవో నిర్ణయించిన ధరపై వేలం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కావున ఆసక్తి గలవారు వేలం పాటలో పాల్గొనాలని సూచించారు.

April 2, 2026 / 09:35 AM IST

కేజీబీవీలో దరఖాస్తుల గడువు పొడిగింపు

అన్నమయ్య: కేజీబీవీల్లో ప్రవేశాల కోసం ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఏప్రిల్ 10 వరకు పొడిగించినట్లు సమగ్ర శిక్ష ఎస్పీడీ శ్రీనివాసులరావు తెలిపారు. 6, 11 తరగతుల్లో ప్రవేశాలు, 7-10, 12 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ అవకాశం కల్పించారు. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు గడువు పెంచినట్లు తెలిపారు. అర్హత గల బాలికలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

April 2, 2026 / 09:30 AM IST

చైత్ర పౌర్ణమి నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SKLM: పాతపట్నం మహేంద్ర తనయ నది పరివాహక ప్రాంతంలో గల శ్రీ నీలకంఠేశ్వర స్వామికి చైత్ర బహుళ శుద్ధ పౌర్ణమి సందర్భంగా గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకల పూజలు అనంతరం స్వామివారిని పాతపట్నం మరియు ఒడిస్సా రాష్ట్ర గజపతి ప్రాంతాల నుంచి భక్తులు దర్శినానికిి వచ్చి స్వామి తీర్థప్రసాదాలు స్వీకరించారు.

April 2, 2026 / 09:30 AM IST

‘ఆశా వర్కర్లు నియామకంలో అన్యాయం’

PPM: ఆశా వర్కర్ పోస్ట్ నియామకం లో తనకు అన్యాయం జరిగిందని పత్తిక కళావతి అనే గిరిజన అభ్యర్థి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు సర్పంచ్ పువ్వల అజిరీ, మాజీ సర్పంచ్ సురేష్‌తో కలిసి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. కురుపాం మండలం, బియ్యల వలస పంచాయతీ సూర్య నగరం ఆశా వర్కర్ మెరిట్ ఉన్నవారికి ఇవ్వలేదని అన్నారు.

April 2, 2026 / 09:29 AM IST

సత్తా చాటుతున్న జిల్లా హాకీ క్రీడాకారులు

VSP: బీహార్ రాష్ట్రం రాజగిరిలో జరుగుతున్న జాతీయస్థాయి సబ్ జూనియర్ హాకీ పోటీల్లో జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. పాండిచ్చేరితో జరిగిన మ్యాచ్ లో గోల్ కీపర్ దేవేంద్ర వెంకట్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ లభించింది. సూర్య, చైతన్య చెరో గోల్ చేయడంతో 3-1 తేడాతో రాష్ట్ర జట్టు గెలుపొందినట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కే నరేష్ గురువారం తెలిపారు.

April 2, 2026 / 09:27 AM IST

MBU వివాదం.. నలుగురు అరెస్ట్

TPT: విద్యార్థి నేతలపై మోహన్ బాబు యూనివర్సిటీ (MBU) సిబ్బంది, బౌన్సర్లు దాడి, కిడ్నాప్ చేసిన కేసులో పోలీసుల విచారణ వేగవంతమైంది. ఈ కేసులో తాజాగా మధు, కిరణ్ కుమార్ రెడ్డి, హరికృష్ణ, కిషోర్ అనే మరో నలుగురిని తిరుచానూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.

April 2, 2026 / 09:24 AM IST

నేటి నుంచి నాదెండ్ల మండలంలో ప్రత్యేక పాలన

PLD: నాదెండ్ల మండలంలోని 14 గ్రామ పంచాయతీల సర్పంచ్‌ల ఐదేళ్ల పదవీకాలం బుధవారంతో ముగిసింది. దీంతో గ్రామాల్లో ప్రజాప్రతినిధుల పాలనకు తెరపడగా, గురువారం నుంచి ప్రత్యేక అధికారుల పాలన రానుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంలో జాప్యం కారణంగా స్థానిక ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల నగారా మోగే వరకు ప్రభుత్వ అధికారులు నిబంధనల బాధ్యతలను పర్య వేక్షించనున్నారు.

April 2, 2026 / 09:22 AM IST

లోకేష్‌కు ఘన స్వాగతం పలికిన హిందూపురం ఎంపీ

సత్యసాయి: మంత్రి నారా లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. విమానాశ్రయం చేరుకున్న ఆయనకు హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి ఘన స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులతో భేటీ అయ్యేందుకు లోకేష్ హస్తినకు చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానాశ్రయం వద్ద పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చాయి. పలు అభివృద్ధి పనులపై కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది.

April 2, 2026 / 09:20 AM IST