VZM: సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గజపతినగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో గల అంగన్వాడీలు ముఖ్యమంత్రి చంద్రబాబుతో అడ్రస్ చేస్తూ మంగళవారం పోస్ట్ కార్డు ఉద్యమం సీఐటీయూ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రాజెక్టు కార్యాలయం వద్ద ధర్నా జరిపిన అనంతరం సీడీపీవోకి వినతి పత్రాన్ని అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ATP: ఏపీఎస్పీ బెటాలియన్ సిబ్బంది సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి, పరిష్కారానికి మార్గం సుగమం చేసిన శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీని 14వ బెటాలియన్ సిబ్బంది మంగళవారం ఘనంగా సన్మానించారు. గత ప్రభుత్వంలో రద్దయిన ప్రయోజనాలను తిరిగి కల్పించేలా కూటమి ప్రభుత్వం ద్వారా ఆమె చేసిన కృషిపై సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
AKP: నర్సీపట్నం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ (సీఐటీయూ) ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్మికులు ధర్నా నిర్వహించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వేసవి సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న 1810 మినీ వర్కర్స్, 136 సూపర్వైజర్ ప్రమోషన్లు వెంటనే అమలు చేయాలని, ఆయాల ప్రమోషన్ సమస్యలు పరిష్కరించాలన్నారు.
ASR: సహకార సంఘాల బలోపేతానికి, పారదర్శక పాలనకు సహకార చట్టాలపై పూర్తి అవగాహన ఉండాలని జిల్లా సహకార అధికారి రామకృష్ణంరాజు అన్నారు. జిల్లా సహకార శాఖ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల సీఈవోలు, గిరిజన కో-ఆపరేటివ్ సహకార సంస్థల సిబ్బందికి మంగళవారం పాడేరులో శిక్షణ నిర్వహించారు. చట్టపరమైన నిబంధనలను పాటిస్తూ రైతులకు, సంఘ సభ్యులకు మెరుగైన సేవలు అందించాలన్నారు.
నెల్లూరు: CM చంద్రబాబు ఏప్రిల్ 1న (బుధవారం) వింజమూరు పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా అధికారులను ఆదేశించారు. వింజమూరులోని పలు ప్రాంతాలను కలెక్టర్, ఎస్పీ, జేసీ పరిశీలించి భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. అధికారులంతా బాధ్యతగా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
NLR: కలిగిరి మండలం కుమ్మర కుండూరు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాపర్ల సుబ్బలక్ష్మి రాణి స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆమె ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. గత 37 సంవత్సరాలుగా ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా విధులు నిర్వహించారు.
NDL: డోన్ మండలం గోసానిపల్లెలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. ఏడీ ఆర్. నాగరాజు మాట్లాడుతూ.. 4 నెలలు పైబడిన పశువులకు గాలికుంటు టీకాలు తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అనంతరం రైతులకు మందులు పంపిణీ చేశారు.
SKLM: పోలీసు శాఖలో సుదీర్ఘ సేవలు అందించి మంగళవారం ఉద్యోగ విరమణ పొందుతున్న స్పెషల్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ ఎస్.వి. రమణను జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ మహేశ్వర రెడ్డి మంగళవారం సత్కరించారు. ఆయనకు దుశ్శాలువ కప్పి, జ్ఞాపికను అందజేశారు. ఎస్.వి. రమణ దీర్ఘకాలం పాటు నిబద్ధతతో, అంకితభావంతో విధులు నిర్వర్తించి చేసిన సేవలను కొనియాడారు.
PPM: కొమరాడ మండల కేంద్రంలో మంగళవారం ఉదయం పశువులతో వస్తున్న వ్యాన్ టూ వీలర్‌ను ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రాథమిక చికిత్స అనంతరం 108 ద్వారా పార్వతీపురం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తరచూ జరిగే ప్రమాదాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
అన్నమయ్య: మదనపల్లిలో జలధార ప్రాజెక్టు అమలు తీరును కడ స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల బృందం పరిశీలించింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ మాట్లాడుతూ.. కరువు పరిస్థితుల్లో సమిష్టి కృషితో నీటి సంరక్షణ చర్యలు విజయవంతమయ్యాయని తెలిపారు. భూగర్భ జలాల పెరుగుదలతో వ్యవసాయానికి లాభం చేకూరిందని చెప్పారు. జలధార ప్రాజెక్టు రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తుందని తెలిపారు.
ప్రకాశం: కనిగిరి డిగ్రీ కళాశాల ఆవరణలో నిర్మించనున్న మినీ స్టేడియం పనులను మంగళవారం స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు. ఆయన సంబంధిత అధికారులతో కలిసి ప్రదేశాన్ని సందర్శించి, స్టేడియం నిర్మాణానికి సంబంధించిన ప్రణాళికలు, సౌకర్యాల వివరాలు తెలుసుకున్నారు. యువతకు క్రీడా అవకాశాలు మెరుగుపడేలా స్టేడియంను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
KRNL: కోసిగి మండలంలోని కందుకూరు నుంచి అగసనూరుకు వెళ్లే రహదారిలో కడిదొడ్డి క్రాస్ వద్ద కర్నాటక మద్యాన్ని ఆర్లబండకి చెందిన ఉసేని బైక్‌లో తరలిస్తుండగా దాడి చేసినట్లు ఎక్సైజ్ సీఐ భార్గవ్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఉసేని నుంచి 576 కర్నాటక ఒరిజినల్ చాయిస్ 90 ఎంఎల్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వీటి విలువ రూ. 38,800 ఉన్నట్లు తెలిపారు.
కోనసీమ: పి.గన్నవరం ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు మంగళవారం ధర్నా నిర్వహించి, కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని, వేసవి సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనంపై ఈ నెల 18న ప్రకటన చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటికీ స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
PLD: ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై వ్యక్తి మృతి చెందిన సంఘటన దుర్గి మండల పరిధిలోని ముటుకూరు గ్రామంలో చోటు చేసుకుంది. కొల్లి హనుమయ్య (55) తన పొలంలో విద్యుత్ మోటర్ ఆన్ చేసేందుకు వెళ్లగా, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ గురై పడిపోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు అతనిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు.
VZM: మహిళలు, పిల్లల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, రక్షణ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని మంగళవారం గంట్యాడ మండలం నరవలోని మహాత్మా జ్యోతిబాపూలే పాఠశాలలో నిర్వహించారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిణి బాలమణి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వన్ స్టాప్ సెంటర్, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, సఖి నివాస్, శక్తి సదన్ పై అవగాహన కల్పించారు.