VZM: అంగన్వాడీల వర్కర్స్,హెల్పర్స్ సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు తెలిపారు.గత ప్రభుత్వాల హయాంలో రెండుసార్లు అంగన్‌వాడీల జీతాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వానిదే అన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు 50 కోట్ల రూపాయలతో G5 స్మార్ట్‌ఫోన్‌లు అందించారు. ఆధునీకరణకు 50 కోట్లు మంజూరు చేశారని అన్నారు.
PPM: మన్యం పట్టణంలో సోమవారం (ఇవాళ) తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందారు. స్దానికుల వివరాల ప్రకారం.. స్దానిక అగ్రహారం వీధి మెయిన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న గంటా రామకృష్ణ ని లారీ ఢీకొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
TPT: తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలోని ప్రసన్న వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం సందర్భంగా మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. గ్రహణం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు దర్శనాలు పునఃప్రారంభిస్తామని పేర్కొన్నారు.
VSP: పెందుర్తిలో రియల్ ఎస్టేట్ పేరుతో భారీ మోసానికి పాల్పడిన ఒడిశాకి చెందిన నిందితుడు నబీనా బాఘాను పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడు ప్రసాద్ బాబుకు నకిలీ పత్రాలతో స్థలం అమ్ముతామని నమ్మించి రూ.28 లక్షలు కాజేశారు. ఇన్‌స్పెక్టర్ సతీష్ కుమార్ సూచనలతో SI భాస్కరరావు బృందం నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు తరలించినట్లు ఆదివారం తెలిపారు.
GNTR: అంగన్వాడీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో వేతనాల పెంపు, గ్రాట్యూటీ, 5G స్మార్ట్‌ఫోన్ల పంపిణీ వంటి చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. మినీ అంగన్వాడీల అప్‌గ్రేడ్ కోసం రూ. 86.68 లక్షలు విడుదల చేశామని, ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు అందిస్తున్నామని ఆయన వెల్లడించారు.
KKD: ప్రజా సమస్యలు పరిష్కార కోసం జిల్లా, డివిజన్ మండల స్థాయిలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం రోజున యధావిధిగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షన్మోహన్ ఒక ప్రకటనలో తెలియచేసారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామని తెలిపారు. అధికారులు తప్పనిసరిగా హజరు కావాలన్నారు.
అన్నమయ్య: రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం మదనపల్లెకు చేరుకుని స్థానిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటల వరకు కలెక్టర్ కార్యాలయంలో జరిగే DDRC సమావేశంలో హాజరై అభివృద్ధి పనులపై సమీక్షిస్తారు. అనంతరం రాయచోటికి వెళ్లి రాత్రి బస చేయనున్నారు.
NLR: వైసీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మండిపడ్డారు. తనపై అనవసర ఆరోపణలు, విమర్శలు మానుకోవాలని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. పోలీసు రక్షణ లేకుండా ఎదురుగా రావాలని సవాల్ చేస్తూ, అవసరమైతే మోటుకోవడానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
KDP: బ్రహ్మంగారిమఠం మండలంలోని మిట్టమానుపల్లెలో లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల భాగంగా, స్థానికంగా ఉన్న శ్రీ కొండా సింగరాయ స్వామి ఉత్సవము మంగళవారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ముందుగా పంచామృత అభిషేకం అష్టోత్తరం ప్రత్యేక పూజలు, భజనలు, అన్న ప్రసాద వితరణ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు చెప్పారు. భక్తులు తరలివచ్చి పాల్గొనాలన్నారు.
అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి రైతు సంఘం సభ్యులతో సమావేశమయ్యారు. సాగులో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులు ఆమెకు వివరించారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, వారి అభివృద్ధికి పూర్తి మద్దతు ఉంటుందని ఈ సందర్భంగా ఆమె హామీ ఇచ్చారు. మార్కెట్ యార్డులో రైతులకు సౌకర్యాలు కల్పించి, గిట్టుబాటు ధర దక్కేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
E.G: గోపాలపురం మండలం గోపవరం గ్రామానికి చెందిన సత్య సాయి అనే విద్యార్థిని చదువుకు MLA మద్దిపాటి వెంకటరాజు భరోసా ఇచ్చారు. తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆమె కాలేజీ ఫీజు కోసం దాతలు అందించిన రూ. 50 వేలను ఆదివారం అందజేశారు. సహాయం చేసిన హుకుంపేట హోతా రాజా, వేము వెంకట సుభాషిణిలను ఎమ్మెల్యే అభినందించారు.
విజయనగరం జిల్లా ప్రజల సమస్యల పరిష్కారానికి సోమవారం ఉదయం విజయనగరం కలెక్టరేట్లో PGRS నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలు నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరిస్తారన్నారు. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లోనూ అర్జీల స్వీకరణ ఉంటుందన్నారు.
సత్యసాయి: మడకశిర మండలం ఛత్రం గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ కార్యకర్త విజయకుమార్ పక్షవాతంతో మంచాన పడటంపై ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి భార్య సమస్యను వివరించగానే స్పందించిన ఎమ్మెల్యే, ఆ కుటుంబానికి భరోసా కల్పిస్తూ రూ. 1 లక్ష నగదు చెక్కును తక్షణ ఆర్థిక సాయంగా అందజేశారు. అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
ప్రకాశం: అంగన్వాడీ కార్యకర్తలు, చిరుద్యోగుల సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి స్వామి ఆదివారం తెలిపారు. చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీ వేతనాలను రెండుసార్లు పెంచిన ఘనత CM చంద్రబాబుకే దక్కుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.
PLD: దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోని మాచర్ల రైల్వే స్టేషన్‌కు మంచి రోజులు వచ్చాయి. కూటమి ప్రభుత్వం గతి శక్తి పథకం ద్వారా రైల్వే స్టేషన్‌కు మహర్దశ తీసుకువచ్చింది.ఈ పథకం ద్వారా రైల్వే స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్ రూమ్‌తో పాటు అత్యాధునిక వెయిటింగ్ హాల్స్, వీఐపీ లాంజ్ కూడా ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే స్టేషన్ మారనుంది.