• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

భారీగా గుట్కా పట్టివేత..!

KDP: దువ్వూరులో శుక్రవారం జిల్లా విజిలెన్స్ అధికారులు భారీగా గుట్కాను పట్టుకున్నారు. హైదరాబాదు నుంచి ప్రొద్దుటూరుకు లారీలో గుట్కా రవాణా అవుతుండగా దువ్వూరులో పట్టుకున్నారు. 5 గుట్కా బండిల్లు పట్టుకుని, రూ.1.50 లక్షలు పెనాల్టీ విధించారు. జీరోలో రవాణా అవుతున్న ఇతర వస్తువులకు మరో రూ.1.65 లక్షలు పన్ను విధించారు.

February 27, 2026 / 08:30 PM IST

నీటి సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కమిషనర్

SKLM: ఆమదాలవలస మున్సిపాలిటీలో తాగునీటి సరఫరా, పారిశుధ్య పనులపై కమిషనర్ టి.రవి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. నీటి సరఫరా షెడ్యూల్, మోటార్ల పనితీరు, నిల్వ ట్యాంకుల శుభ్రత పై చర్చించారు. వేసవి కాలం దృష్ట్యా నీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు.

February 27, 2026 / 08:30 PM IST

ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి రేపటి షెడ్యూల్

VZM: శృంగవరపుకోట నియోజకవర్గ ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి శనివారం ఉదయం 7 గంటలకు జామి మండలం జడ్డేటివలస గ్రామం మరియు 8 గంటలకు జామి గ్రామంలో NTR భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం చీపురుపల్లి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు పాల్గొనే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం వారు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

February 27, 2026 / 08:30 PM IST

రేపు రాజమండ్రిలో నిరసన ర్యాలీ: నరేష్

EG: శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ సోము వీర్రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతల ప్రవర్తనను ఖండిస్తూ రేపు ఉదయం10గంటలకు ఓబీసీ మోర్చాజిల్లా అధ్యక్షుడు మురుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టనున్నారు. గోకవరం బస్టాండ్ సెంటర్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహాం నుండి కంబాల చెరువు దండి మార్చ్ సెంటర్ వరకు ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు.

February 27, 2026 / 08:29 PM IST

సంతమాగులూరులో నీటి సరఫరా నిలిపివేత

BPT: అద్దంకి కార్యనిర్వాహక ఇంజినీరు ఆదేశాల మేరకు, సంతమాగులూరు ఉపవిభాగం పరిధిలోని కాలువలకు ‘వారబంధి’ పద్ధతిని అమలు చేయనున్నారు. ఈ క్రమంలో మార్చి 2, 3 తేదీలలో రెండు రోజుల పాటు కాలువలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రైతులు, రైతు సంఘాల సభ్యులు ఈ విషయాన్ని గమనించి, అధికారులకు సహకరించాలని కోరారు.

February 27, 2026 / 08:26 PM IST

పాల కేంద్రాలలో తనిఖీలు చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు

నెల్లూరు: జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం, సంఘం మండలాల్లో పాల డైరీలలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. పాలలో కొవ్వు శాతం అధికంగా చూపించేందుకు అన్య పదార్థాలు కలుపుతున్నారని ఆరోపణ రావడంతో తనిఖీలు చేపట్టామని ఫుడ్ సేఫ్టీ అధికారి వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.

February 27, 2026 / 08:24 PM IST

డ్వాక్రా బజారును ప్రారంభించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటు చేసిన డ్వాక్రా బజారును ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా సంఘాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, స్వయం సహాయక సంఘాలు ఉత్పత్తులను మార్కెటింగ్ వేదికలను కల్పించడం ద్వారా వారి ఆదాయాలను పెంపొందించేందుకు తోడ్పడతాయని తెలిపారు.

February 27, 2026 / 08:22 PM IST

జనగణన శిక్షణపై కలెక్టర్ దిశానిర్దేశం

అన్నమయ్య: మదనపల్లి ప్రభుత్వ విధానాల రూపకల్పనలో జనగణన గణాంకాలు కీలకమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన జనగణన దశ-1, గృహ జాబితా శిక్షణలో పాల్గొని మాట్లాడారు. ఖచ్చితమైన సమాచార సేకరణతోనే సంక్షేమ పథకాల అమలు సాఫీగా సాగుతుందన్నారు. ఈసారి సెల్ఫ్ ఇన్యూమరేషన్ విధానం ప్రవేశపెట్టినట్లు తెలిపారు.

February 27, 2026 / 08:20 PM IST

పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం

CTR: చౌడేపల్లి మండలం ఆమెనిగుంట గ్రామ సమీపంలో శుక్రవారం పులికోన వద్ద క్షుద్ర పూజల కలకలం రేగింది. నేలపై రక్తం, నిమ్మకాయలు, రకరకాల పూజ సామాగ్రితో ఉండటంతో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేశారని స్థానికులు అనుమానిస్తున్నారు. దీంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

February 27, 2026 / 08:19 PM IST

రెండు బైకులు ఢీ.. ఇద్దరికి గాయాలు

KRNL: బేతంచర్ల పట్టణం శివార్లలోని డోన్ రోడ్డులో నయారా పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీకి, ఇద్దరు గాయపడ్డారు. హెచ్ కొటాల నుంచి వెళ్తున్న ఒక బైక్, డోన్ వైపు నుంచి వచ్చే మరొక బైక్‌ను ఢీకొట్టింది. స్థానికులు క్షతగాత్రులను 108 అంబులెన్స్‌లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 27, 2026 / 08:15 PM IST

‘గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసింది’

PLD: వినుకొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమావేశంలో ఏఎంసీ ఛైర్మన్ మురళీకృష్ణ మాట్లాడారు. రైతులు ధాన్యం అమ్మిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేసిందన్నారు. రైతులు లాభాల కోసం సంప్రదాయ పంటలు కాకుండా ఉద్యానవన పంటల వైపు మళ్లాలన్నారు. త్వరలో శనగల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు.

February 27, 2026 / 08:14 PM IST

అక్షరాంద్ర కేంద్రాలను పరిశీలించిన ఎంపీడీవో

ELR: ఉంగుటూరు మండలములో యర్రమిల్లిపాడు నాచుగుంట, గోపీనాథ్ పట్నం చేబ్రోలు గ్రామాలలో శుక్రవారం రాత్రి అక్షరాంద్ర కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. మండలంలో అక్షర ఆంధ్ర కేంద్రాలు పనితీరు సంతృప్తికరంగా ఉందన్నారు. వాలంటరీలు నిర్లక్ష్య రాశులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందన్నారు.

February 27, 2026 / 08:13 PM IST

‘ప్రధాన ఆలయాల్లో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలి’

ASR: రాష్ట్రంలోని ప్రధాన హిందూ దేవాలయాల్లో GCC ఆధ్వర్యంలో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు చేయాలని GCC ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీని కోరారు. అమరావతిలో ఆయనను కలిసి ప్రతిపాదనలు వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో GCC స్టాల్స్‌కు సానుకూల స్పందన లభించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

February 27, 2026 / 08:12 PM IST

ఎస్పీకి డ్రోన్ అంజేసిన జనసేన నాయకుడు

CTR: జనసేన పార్టీ సీనియర్ నాయకుడు లోచన్ శ్రీరామ్ DJI ఎయిర్3Sడ్రోన్‌ను ఎస్పీ తుషార్ దూడి సమక్షంలో విరాళంగా అందజేశారు. నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, నిర్జన ప్రదేశాలను బహిరంగ మద్యపానం, జూదం, దొంగతనాలు పర్యవేక్షించడానికి ఈ డ్రోన్ ఉపయోగిస్తామని ఎస్పీ తెలిపారు. స్మార్ట్ పోలీసింగ్, ప్రజా భద్రతను బలోపేతం చేయడానికి ఈ డ్రోన్ ఉపయోగిస్తామన్నారు.

February 27, 2026 / 08:12 PM IST

రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది వీరే..!

NDL: డోన్ మండలం జగదుర్తి వద్ద శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది తెలిసిందే. సీఐ రాకేశ్ వారి మృతదేహాలు బెంగళూరు వాసులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి కర్నూలు వెళ్తున్న కారును క్రేన్ ఢీకొట్టింది. ప్రమాదంలో ప్రమోద్ తీవ్రంగా గాయపడ్డారు, భార్య శాంతా (36), కూతురు భార్గవి (9), కుమారుడు సిద్ధార్థ్ (7) అక్కడికక్కడే మృతి చెందారు.

February 27, 2026 / 08:12 PM IST