ప్రకాశం: దోర్నాల మండలం గంటవానిపల్లి వద్దగల వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి సీఎం చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు. ఆ తర్వాత రైతులతో కలిసి నడుస్తూ పశ్చిమ ప్రాంత సమస్యల గురించి ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు పురోగతిని గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
PPM: రానున్న వేసవిని దృష్ట్యా జిల్లాలో ఎక్కడా తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం కలగకుండా యంత్రాంగం నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రతీ గ్రామంలో క్రాష్ ప్రోగ్రాం జరగాలని, ఒక్క గ్రామానికి కూడా నీటి ట్యాంకర్ అవసరం రాకూడదని అన్నారు.
ATP: నార్పలకు చెందిన సత్యనారాయణమ్మ బుధవారం కన్నుమూశారు. మరణానంతరం ఆమె కళ్లను కుటుంబ సభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. శివన్న, నాగరాజు సహకారంతో రెడ్ క్రాస్ సంస్థకు నేత్రాలను అందజేశారు. గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన కుటుంబ సభ్యులను రెడ్ క్రాస్ సంస్థ ప్రత్యేకంగా అభినందించారు.
కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి వెలిచేరుకు చెందిన నల్లం వెంకట్రామారావు కుటుంబ సభ్యులు రూ.1,00,116 విరాళాన్ని బుధవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ చక్రధరరావు దాత కుటుంబ సభ్యులకు స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.
KDP: గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న SC సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కుమార్ ఆరోగ్య పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆరా తీశారు. మేయర్ సురేష్‌కు ఫోన్ చేసి వీడియో కాల్ ద్వారా సునీల్ కుమార్‌ను పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సునీల్ ఆరోగ్యం మెరుగుపడాలని ప్రార్థనలు చేస్తున్నారు.
GNTR: మార్చి 1 ఆదివారం కావడంతో పింఛనుదారులకు ఒకరోజు ముందుగానే నగదు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 28 శనివారం జిల్లాలో పింఛన్ల పంపిణీ చేపట్టనున్నారు. మొత్తం 2,51,879 మంది లబ్ధిదారులకు రూ.1095.5 కోట్లను అందించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెలవుదినాల కారణంగా ముందుగానే పింఛన్లు ఇవ్వడం ఇది ఏడోసారి.
కోనసీమ: ఇప్పడపాడు నుండి పెద్ద ఎత్తున తన అనుచరులతో కలసి టీడీపీలో చేరితే జిల్లా వైసీపీ పార్టీ ఉపాధ్యక్షులు పిల్లా వీరబాబు బూటకపు చేరికలు అంటున్నారని, బహుశా వారికి కళ్ళు సరిగా కనిపించటంలేదోమోనని చిన్ని గంగాధరరావు అన్నారు. మండపేట టీడీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నుండి టీడీపీలో చేరితే అది జీర్ణించుకోలేని వీరబాబు బూటకపు చేరికలని అనటం విడ్డూరం అని అన్నారు.
NDL: కోయిలకుంట్ల పట్టణంలో ఇవాళ మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పర్యటించారు. పట్టణంలోని శ్రీ అష్టలక్ష్మి కళ్యాణ వెంకటేశ్వర స్వామి మూడవ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ వార్షికోత్సవ వేడుకలలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ELR: కోకో చెట్లకు వివిధ శిలీంద్రాలు తాకిడి వలన పూత, పిందెపై తీవ్ర ప్రభావం ఉందని ఉద్యాన అధికారి అమర్నాథ్ అన్నారు. ఉంగుటూరు(M) యర్రమిల్లిపాడులో రైతులకు కోకో పంటలో వివిధ తెగుళ్లు, పురుగుల యాజమాన్యంపై అవగాహన కార్యక్రమము జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ రాజేష్, రైతులు, పాల్గొన్నారు.
సత్యసాయి: CM చంద్రబాబు నాయుడును బుధవారం జిల్లా ప్రజాప్రతినిధులు కలిశారు. ఎంపీ బీకే పార్థసారథి, జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి ఇన్‌ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ అమరావతిలో సీఎంతో భేటీ అయ్యారు. జిల్లా అభివృద్ధి పనులు, పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సందర్భంగా చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ముఖ్యమంత్రి వారికి దిశానిర్దేశం చేశారు.
అన్నమయ్య: రాజంపేట మన్నూరు చెరువు వద్ద బుధవారం జరిగిన గంగ హారతి కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు పాల్గొన్నారు. నీటి సంరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చితికిపోయిందని విమర్శించారు.
TPT: ఏర్పేడు మండలంలో రెండున్నరేళ్ల బాలికను హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటనపై తిరుపతి ఈస్ట్ పోలీసులు తమకు సమాచారం ఇచ్చారని తహసీల్దార్ భార్గవి తెలిపారు. పోలీసుల అభ్యర్థన మేరకు రెవెన్యూ అధికారులతో కలిసి నిందితుడు చూపించిన స్థలానికి వెళ్లి తవ్వకాలు చేశామన్నారు. బాలిక మృతదేహం బయటపడిందని.. మెడికల్ అధికారుల సమక్షంలో పంచానామా పూర్తి చేశామని తెలిపారు.
NDL: నంద్యాల పట్టణంలో ఇవాళ దాసరి కళ్యాణ్, మనోహర్ అనే ఇద్దరు వ్యక్తులు గంజాయిని అక్రమంగా రవాణా చేస్తు పట్టుబడ్డారు. ఇద్దరినీ వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రెండు కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ సుధాకర్ రెడ్డి తెలిపారు.
ప్రకాశం: అర్ధవీడు మండలం బొమ్మిలింగం గ్రామంలో శ్రీ కోదండ రామస్వామి 35వ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బుధవారం వైసీపీ ఇన్ ఛార్జ్ కేపీ నాగార్జున రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఎడ్ల పందాలు పోటీలను ఆయన ప్రారంభించారు. పోటీలను వీక్షించేందుకు చుట్టుపక్కల గ్రామస్తులు భారీగా వచ్చారు.
KNRL: కోసిగి(మం) జంపాపురంలో వెలసిన శ్రీ బసవేశ్వర స్వామివారిని మంత్రాలయం MLA వై.బాలనాగిరెడ్డి బుధవారం దర్శించుకున్నారు. దర్శనార్థం కోసం వచ్చిన ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట మండల వైసీపీ నాయకులు పాల్గొన్నారు.