NTR: చందర్లపాడు పోలీసులు డ్రగ్స్‌పై దండయాత్ర-2.0లో భాగంగా గురువారం లక్ష్మీపురం మిర్చి పొలాల్లో కూబింగ్ నిర్వహించారు. అనంతరం గ్రామసభలో గంజాయి వాడకం, సరఫరాపై చట్టపరమైన చర్యల గురించి వివరించారు. సమాచారం ఉంటే 1930, 1972కు కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, బాలల రక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ లక్ష్మీనారాయణ, ఏసీపీ తిలక్ తదితరులు పాల్గొన్నారు.