KKRపై అద్భుత ఇన్నింగ్స్‌తో ముకుల్ చౌదరి ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఈ క్రమంలో అతడిపై LSG కోచ్ జస్టిన్ లాంగర్ ప్రశంసలు కురిపించాడు. ‘మా వీడియో అనలిస్ట్ సూచన మేరకు ముకుల్‌ను వేలంలో కొనుగోలు చేశాం. నెట్స్‌లో అతడి బ్యాటింగ్ శైలి, వికెట్ల మధ్య పరిగెత్తే తీరు తనకు కోహ్లీని గుర్తుచేశాయి. అతడు టీమిండియాకు తప్పకుండా ప్రాతినిధ్యం వహిస్తాడు’ అని తెలిపాడు.