• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి సేవలో ఎమ్మెల్యే

TPT: సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్ కనకమేడల రవీంద్ర కుమార్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు వచ్చారు. వేర్వేరుగా శుక్రవారం వేకువజామున శ్రీవారిని అభిషేక సేవలో దర్శించుకున్నారు. అనంతరం వీరికి ఆలయ రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనంతో తీర్థప్రసాదాలను అందజేశారు.

March 27, 2026 / 11:13 AM IST

సీతారాముల కల్యాణానికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి

అన్నమయ్య:  శ్రీ రామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణ మహోత్సవానికి పట్టు వస్త్రాల సమర్పణ కోసం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ తమ స్వగ్రామం బోరెడ్డిగారిపల్లె నుంచి శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో బయలుదేరారు. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ శ్రీ సీతారాముల ఆశీస్సులు లభించి ప్రజలు సుఖశాంతులతో జీవించాలని కోరారు.

March 27, 2026 / 11:10 AM IST

బుచ్చిరెడ్డిపాలెంలో వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం

NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా రెండవ రోజు ధ్వజారోహణ కార్యక్రమాన్ని అర్చకులు నిర్వహించారు. ధ్వజపటం ఎగరవేసి సకల దేవతలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో సీఐ శ్రీనివాసరావు, ఎస్సై సంతోష్ రెడ్డి సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.

March 27, 2026 / 11:10 AM IST

జాలారిపేటలో మంచినీటి బోరు ప్రారంభం

AKP: పరవాడ మండలం ముత్యాలమ్మపాలెం శివారు జాలరిపేటలో మంచినీటి బోరును గ్రామ సర్పంచ్ చింతకాయల సుజాత, ఎంపీటీసీ అర్జిల్లి దేవి శుక్రవారం ప్రారంభించారు. తాగునీటి ఎద్దడి నివారణ కోసం మండల పరిషత్ నిధి నుంచి మంచినీటి బోరు వేయించినట్లు పేర్కొన్నారు. వేసవికాలం దృష్ట్యా తాగునీటిని పొదుపుగా వాడాలని సూచించారు.

March 27, 2026 / 11:09 AM IST

చెన్నై వెళ్తున్నారా.. జాగ్రత్త..?

CTR: చిత్తూరు, తిరుపతి జిల్లాలకు తమిళనాడు సరిహద్దుగా ఉంటుంది. మనవాళ్లు చాలామంది బంగారు ఆభరణాలు, పట్టుచీరలు, ఇతర వ్యాపారాలు, ఆసుపత్రుల నిమిత్తం చెన్నై, వేలూరు, కంచి తదితర ప్రాంతాలకు వెళ్తుంటారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడంతో రూ.50వేలకు పైగా నగదు, విలువైన ఆభరణాలు తీసుకెళ్తే తగిన పేపర్లు చూపించాలి. లేకపోతే సీజ్ చేస్తారు.

March 27, 2026 / 11:05 AM IST

అడవిలో అపురూప రామాలయం

E.G: సీతానగరం, పురోషోతగ్రామల సమీపంలో పురాతన శ్రీసీతారామలక్ష్మణ ఆలయం ఉంది. అడవుల మధ్య కొండలపై ఉన్న ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని స్థానికులు కోరుతున్నారు. ఇక్కడి కోనేరులో నీరు ఎంతో తియ్యగా ఉండటం విశేషం. పూర్వం ఇక్కడ సీతారాములు నివసించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాలన్న ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు.

March 27, 2026 / 11:00 AM IST

గ్యాస్ సిలిండర్ల అక్రమ నిల్వపై కఠిన చర్యలు: జేసీ

ATP: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, వినియోగదారుల బుకింగ్‌లపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమీక్ష నిర్వహించారు. చమురు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి సిలిండర్ల సరఫరాలో బ్యాక్‌లాగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 204 సిలిండర్లను సీజ్ చేసి 16 కేసులు నమోదు చేశారని అన్నారు.

March 27, 2026 / 11:00 AM IST

భద్రాచలం నుంచి అమలాపురంకు ప్రత్యేక బస్సులు: DM

కోనసీమ: శ్రీరామనవమి సందర్భంగా అమలాపురం ఆర్టీసీ బస్టాండ్ నుంచి భద్రాచలంకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ శర్మ తెలిపారు. కళ్యాణం ముగిసిన తర్వాత భద్రాచలం నుంచి మధ్యాహ్నం 1:30 నుంచి రాత్రి 8:30 గంటల వరకు వివిధ సమయాలలో పలు బస్సులు నడుస్తాయని తెలిపారు. ఇందులో ఇంద్ర ఏసి సర్వీస్ బస్సు కూడా అందుబాటులో ఉంటుందన్నారు.

March 27, 2026 / 11:00 AM IST

బిడ్డను బతికించాలని ప్రభుత్వాన్నికోరిన తల్లిదండ్రులు

VZM: రాజాం (M) బొద్దాం గ్రామానికి చెందిన 15 ఏళ్ల చిన్నారి పత్తిరి వైష్ణవి బోన్ మారోతో ఆసుపత్రి పాలైంది. పదో తరగతి పరీక్షలు రాయాల్సిన వైష్ణవి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. చికిత్స నిమిత్తం రూ. 20 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలీలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

March 27, 2026 / 10:56 AM IST

‘నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసగిస్తోంది’

VSP: కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను మోసగిస్తోందని ఏఐవైఎఫ్ ప్రధాన కార్యదర్శి అచ్యుతరావు ఆరోపించారు. గత ప్రభుత్వంలో 2 లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయని ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం నేడు 10,060 పోస్టులు ఇచ్చి నిరుద్యోగులను దగా చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమాచారం విశాఖపట్నంలో జరిగిన ఏఐవైఎఫ్ ఆఫీస్ బ్యానర్ సమావేశంలో మాట్లాడారు

March 27, 2026 / 10:51 AM IST

వేసవి క్రీడా శిబిరాలకు దరఖాస్తుల ఆహ్వానం

ASR: జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాల నిర్వహణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ అధికారి ఎ.జగన్మోహన్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు, క్రీడా అసోసియేషన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు, సీనియర్ క్రీడాకారులు ఈనెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు తమను సంప్రదించాలని కోరారు.

March 27, 2026 / 10:51 AM IST

రామాలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

పార్వతీపురం పాత బస్ స్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ రామాలయంలో స్థానిక ఎమ్మెల్యే బోనాల విజయ్ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం శ్రీ రామనవమి సందర్భంగా శ్రీ సీతారాములవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ప్రజలందరికీ మంచి జరగాలని దేవుడిని వేడుకున్నట్లు వెల్లడించారు. ఆలయానికి వచ్చిన భక్తులకు, అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

March 27, 2026 / 10:50 AM IST

దామలచెరువులో సీతారాముల కళ్యాణం

TPT: పాకాల (M) దామలచెరువులోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో గురువారం రాత్రి సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను మేళతాళాలతో కళ్యాణ వేదికపైకి తీసుకొచ్చారు. వేద్ర మంత్రాల నడుమ పునర్వహ నక్షత్రం, అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం జరిపించారు. సీతారాముల పై ముత్యాల తలంబ్రాలు పోశారు. భక్తులకు వడ పప్పు, పానకాన్ని పంపిణీ చేశారు.

March 27, 2026 / 10:46 AM IST

శ్రీ నీలమణి అమ్మవారి హుండీ ఆదాయం ఎంతంటే..?

SKLM: ఉత్తరాంధ్ర ఇలవేల్పు పాతపట్నం శ్రీ నీలమణి దుర్గ అమ్మవారు ఆలయ ప్రాంగణంలో టెక్కలి ఈవో మనస్విని ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు గురువారం జరిగింది. 53 రోజులకు గాను రూ. 7,67,176ల ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈవోతో పాటు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

March 27, 2026 / 10:36 AM IST

గండేపల్లి విద్యార్థి బొక్కా కౌశిక్ అద్భుత ప్రతిభ..!

NTR: కంచికచర్ల మండలం గండేపల్లికి చెందిన బొక్కా కౌశిక్ అనే వాద్యార్థి శ్రీ చైతన్య INTSE పోటీల్లో రాణించి గ్రాండ్ ప్రైజ్ కింద ల్యాప్‌టాప్ గెలుచుకున్నాడు. నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా ఈ బహుమతి అందుకున్నాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రమేష్, ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు. చిన్న వయసులోనే కౌశిక్ సాధించిన ఈ విజయం గ్రామానికి గర్వకారణమని ఎమ్మల్యే అన్నారు.

March 27, 2026 / 10:36 AM IST