ATP: జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, వినియోగదారుల బుకింగ్‌లపై జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ సమీక్ష నిర్వహించారు. చమురు కంపెనీల ప్రతినిధులతో మాట్లాడి సిలిండర్ల సరఫరాలో బ్యాక్లాగ్ లేకుండా చూడాలని ఆదేశించారు. జిల్లాలో ఇప్పటికే టాస్క్‌ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహించి, అక్రమంగా నిల్వ ఉంచిన 204 సిలిండర్లను సీజ్ చేసి 16 కేసులు నమోదు చేశారని అన్నారు.