VZM: రాజాం (M) బొద్దాం గ్రామానికి చెందిన 15 ఏళ్ల చిన్నారి పత్తిరి వైష్ణవి బోన్ మారోతో ఆసుపత్రి పాలైంది. పదో తరగతి పరీక్షలు రాయాల్సిన వైష్ణవి ప్రస్తుతం ఆసుపత్రిలో ఉంది. చికిత్స నిమిత్తం రూ. 20 లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. తల్లిదండ్రులు ఇద్దరూ రోజువారి కూలీలు కావడంతో ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.