ప్రధాని మోడీకి తాను పెద్ద ఫ్యాన్ అని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని తనను కోరానని, వచ్చే ఏడాది ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు.
Musk meets Modi: అమెరికాలో పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోడీ ( PM Modi) బిజీగా ఉన్నారు. లొట్టే న్యూయార్క్ ప్యాలెస్లో మోడీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సమావేశం అయ్యారు. మోడీతో (Modi) సమావేశంలో వివిధ అంశాలపై చర్చించానని మస్క్ వివరించారు. వచ్చే ఏడాది తాను భారత్ వస్తానని తెలిపారు. మోడీకి తాను పెద్ద ఫ్యాన్ అని వివరించారు. భారత్లో పెట్టుబడులు పెట్టాలని మోడీ కోరారని.. అందుకు తాను సానుకూలంగా స్పందించానని హింట్ ఇచ్చారు.
ప్రధాని మోడీ (Modi) నాయకత్వాన్ని మస్క్ కొనియాడారు. ‘భారత్ భవిష్యత్ ఎలా ఉంటుందో చూడాలనే ఉత్సాహం ఉంది. ప్రపంచంలో ఏ పెద్ద దేశం చేయని హామీలను భారత్ ఇచ్చింది. దేశం కోసం మోడీ సరైన పని చేస్తున్నారు. కొత్త కంపెనీలకు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఎంకరేజ్ చేస్తున్నారు అని’ మోడీని ప్రశంసలతో ముంచెత్తారు.
త్వరలో టెస్లా భారత్లో పెట్టుబడులు పెట్టబోతుందని ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మస్క్ ప్రకటించారు. భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని గతంలో తాను కోరిన విషయాన్ని ప్రస్తావించారు. దేశం గురించి మోడీ (Modi) ఎక్కువగా శ్రద్ద వహిస్తారని.. దేశంలోకి భారీ పెట్టుబడులు తీసుకొచ్చేందుకు పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తారని వివరించారు. ఆ తర్వాత మోడీ మాట్లాడుతూ.. శక్తి నుంచి ఆధ్మాత్మికతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించామని ట్వీట్ చేశారు. ‘ ఈ రోజు మిమ్మల్ని కలువడం ఆనందంగా ఉంది. వివిధ అంశాలపై చర్చించామని’ పేర్కొన్నారు.