AP: బీఆర్ అంబేద్కర్ గురుకులాల్లో ఐదో తరగతి, జూనియర్ ఇంటర్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSWREIS కార్యదర్శి వెంకటేష్ తెలిపారు. అలాగే, 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న ఖాళీల్లో అర్హులైన విద్యార్థులను ఎంపిక చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు చెప్పారు. అర్హులైన విద్యార్థులు https://apgpcet.apcfss.inలో దరఖాస్తు చేసుకోవచ్చు.