KRNL: పత్తికొండ మండలం దేవనబండ–అటికెలగుండు గ్రామాల మధ్య వంక బ్రిడ్జిపై లారీ ప్రమాదం జరిగింది. వడ్ల లోడుతో కోవెలకుంట్ల నుంచి సిరుగుప్ప వెళ్తున్న లారీ అదుపుతప్పి వంకలో పడింది. ధాన్యం నేలపాలవగా డ్రైవర్‌కు గాయాలయ్యాయి. వారం క్రితమే ప్రమాదంపై హెచ్చరించినా అధికారులు చర్యలు తీసుకోలేదని మంగళవారం స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.