sharmila on hijras:హిజ్రాలకు (hijras) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (sharmila) బేషరతుగా క్షమాపణలు చెప్పారు. హిజ్రాలను కించపరిచే ఉద్దేశం తమకు లేదన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) తనను అవమానిస్తే తిప్పికొట్టే ప్రయత్నం చేశానని వివరించారు. హిజ్రాలకు (hijra) సమాజంలో విలువ ఉందని చెప్పానని తెలిపారు. వారు గొప్పగా బతుకుతున్నారని.. వారి కన్నా కూడా దిగజారి శంకర్ నాయక్ బతుకుతున్నాడని అన్నానని తెలిపారు. ఒకవేళ ‘నా హిజ్రా అక్క చెల్లెలకు మనసు నొప్పించి ఉంటే బేషరతుగా క్షమాపణ చెప్తున్నాను’ (sorry) అని షర్మిల స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ (cm kcr) మీ జీవితాలను ఎలా ఆదుకున్నారో చెప్పాలని అడిగారు. మీ కోసం ఏమి చేశారో ఆలోచన చేయాలని కోరారు. YSR తెలంగాణ పార్టీ అధికారంలో వచ్చాక మీకు అన్ని పతకాలు వర్తింపు చేస్తామని హామీనిచ్చారు. మీ మర్యాద పెంచేలా మనసు స్ఫూర్తిగా మాట ఇస్తున్నామని తెలిపారు. లోన్లు ఇస్తాం.. మీ కాళ్ళ మీద నిలబడే విధంగా చూస్తామని షర్మిల స్పష్టంచేశారు.
తను శంకర్ నాయక్‌ను (shankar naik) దూషించలేదు.. ఆయనే తనను వలసదారు అన్నాడు, కొజ్జా లాగ ఉంటారు అన్నాడని షర్మిల (sharmila) గుర్తుచేశారు. తనను కొజ్జా అని అంటేనే అనాల్సి వచ్చిందన్నారు. మహిళ మంత్రి శిఖండి అని అంటే… ఏమి అనలేదు. మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy) మరదలు అంటే.. ఏవడ్రా మరదలు అన్నాను. కానీ వ్యక్తి గత దూషణలు చేయలేదని షర్మిల అన్నారు. ఎమ్మెల్యేను కొట్టమని చెప్పలేదు, ఎమ్మెల్యే వాహనాలు ధ్వంసం చేయమని చెప్పలేదన్నారు. తన వ్యాఖ్యలకు రెచ్చి పోయి ఎమ్మెల్యే మీద దాడులు జరగలేదన్నారు. ఎమ్మెల్యేల అవినీతి ఆరోపణల మీద మాత్రమే మాట్లాడామని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik) తననే కాదు ఇతర మహిళలను కూడా అవమానించాడని తెలిపారు. మహిళా ఐఏఎస్ అధికారి చేయి పట్టుకున్నాడని.. ఇలాంటి వారికి మహిళల మీద గౌరవం ఉన్నట్లా.? అని అడిగారు. సీఎం కేసీఆర్ బిడ్డ లిక్కర్ స్కాంలో ఉన్నారు. శంకర్ నాయక్ భార్య ఏకంగా భూ కబ్జాలకు పాల్పడుతోంది. అవినీతిని ప్రశ్నిస్తే.. ఇంత రాద్దాంతం చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులకు అంతా ఏకతాటిపై రావాలని సూచించారు. BRS సర్కార్‌కి వ్యతిరేక ఉద్యమం ప్రారంభించాలని కోరారు. BRS నాయకుల ఆగడాలను నిలువరించాలని కోరారు.