BHNG: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ ఛైర్పర్సన్ బండ్రు శోభారాణి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. పార్లమెంట్లో ప్రజల సమస్యలను ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి ఆయన తన వంతు కృషి చేయాలని శోభారాణి ఆకాంక్షించారు.