చంద్రబాబు(Chandrababu) డైరెక్షన్లోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మాట్లాడుతున్నారని, పవన్ ఎమ్మెల్యేగా కూడా గెలుస్తాడో లేదోనని వైసీపీ నేత పోసాని కృష్ణ మురళి(Posani KrishnaMurali) విమర్శించారు. కాపునేత ముద్రగడ(Mudragada) స్పూర్తితోనే తాను గణపతి సినిమా తీసినట్లు చెప్పుకొచ్చారు. ముద్రగడ గొప్ప నాయకుడని అన్నారు. పవన్ కాపులను తిట్టి కులచిచ్చు రేపుతున్నాడనన్నారు. ముద్రగడకు పవన్ క్షమాపణలు చెప్పి తీరాలని పోసాని డిమాండ్ చేశారు.
చదవండి: CM KCR: విశాఖలో ఎకరం అమ్మితే తెలంగాణలో 150 ఎకరాలు కొనొచ్చు, అమర్ నాథ్ కౌంటర్
పవన్(Pawan Kalyan) వల్లే కాపుల్లో చిచ్చు మొదలైందన్నారు. పవన్ కాపులను తిట్టి చంద్రబాబు(Chandrababu)ను పొగడం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు, లోకేష్ కన్నా పవన్ చాలా మంచివాడని, అటువంటి వ్యక్తి బాబు మాటలు విని మోసపోతున్నాడన్నారు. ఏపీ(Ap)లో కాపుల మధ్య చిచ్చు పెట్టి గెలవలేరని అన్నారు.

