PKSDT నుంచి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అప్ డేట్ రానే వచ్చింది. పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయిధరమ్ తేజ్(sai dharam tej) కలిసి యాక్ట్ చేస్తున్న ‘బ్రో’ మూవీ మోషన్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ తమిళ సూపర్‌హిట్ చిత్రం వినోదయ సీతమ్ తెలుగు రీమేక్ గా రాబోతుంది. పవన్ కళ్యాణ్, సాయి తొలిసారి కలిసి తెరపై కనిపించనున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొంది.
సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పవన్ కళ్యాణ్(pawan kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) మూవీ నుంచి క్రేజీ అప్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం తమిళ సూపర్ హిట్ చిత్రం వినోదయ సీతమ్‌కి అధికారిక రీమేక్. ఒరిజినల్ తమిళ వెర్షన్‌కి దర్శకత్వం వహించిన సముద్రఖని PKSDTకి కూడా డైరెక్షన్ చేస్తున్నారు. సినిమా టైటిల్ బ్రో అని.. మోషన్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. తన మామ పవన్ కల్యాణ్ గురువు అని.. ఆయనతో కలిసి నటించడం తన కల అన్నారు సాయిధరమ్ తేజ. ఈ మేరకు ట్వీట్ చేశారు.
మరణం తరువాత తన తప్పులను సవరించుకోవడానికి జీవితంలో రెండో అవకాశం ఇచ్చిన అహంకారి చుట్టూ కథ తిరుగుతుంది. ఇది ఒక ఫాంటసీ డ్రామా. ఈ చిత్రంలో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ, బ్రహ్మానందం, రోహిణి మొల్లేటి, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, రాజా చెంబోలు కీలక పాత్రలు నటిస్తున్నారు.
జీ స్టూడియోస్‌తో కలిసి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే రాశారు. దీంతో పవన్ అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు పెరిగాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం జూలై 28న విడుదల కానుంది.
Working with my Guru @PawanKalyan mama is a BIG BIG DREAM come true. And now I'm super excited and blessed at this amazing opportunity. ( The fanboy in me is dancing like crazy)