భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఈడీకి లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఈఎంఈఐ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు.
భారత రాష్ట్ర సమితి నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం ఈడీకి లేఖ రాశారు. ఈ మేరకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేంద్రకు లేఖ రాశారు. తాను విచారణకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించారు. ఈడీ ఆరోపించిన తన 10 ఫోన్లను ఈఎంఈఐ నెంబర్లతో సహా జమ చేస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఒక మహిళ స్వేచ్ఛకు భంగం కలిగించేలా తన మొబైల్ ఫోన్లను కోరారని, అయినా తాను ఉపయోగించిన అన్ని ఫోన్లను జమ చేస్తున్నట్లు తెలిపారు. దర్యాఫ్తుకు సంబంధించిన వాస్తవ విరుద్ధమైన అంశాలను మీడియాకు ఇస్తున్నారని ఆరోపించారు.
రాజకీయ కోణంలోనే ఈడీ తనను విచారిస్తోందని కవిత ఆ లేఖలో ఆరోపించారు. తనపై ఈడీ దురుద్దేశ్యంతో వ్యవహరిస్తోందన్నారు. నేను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం చేశారని, అందుకే తన పాత ఫోన్లను సమర్పిస్తున్నట్లు చెప్పారు. నవంబర్ లోనే తాను ఫోన్లను ధ్వంసం చేసినట్లు ప్రచారం చేశారని, కానీ తనకు నోటీసులు మాత్రం మార్చిలో ఇచ్చారన్నారు. తనకు సమన్లు జారీ చేయకుండానే ఆరోపణలు ఎలా చేశారని ప్రశ్నించారు. తొలిసారి మార్చి నెలలో విచారణకు ఈడీ పిలిచిందని, కానీ నవంబర్ నెలలోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఎలా చెబుతారని అన్నారు.
కవిత సెల్ ఫోన్లు ధ్వంసం చేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) చేసిన వ్యాఖ్యల పైన మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) స్పందించారు. కవిత ఫోన్లను ధ్వంసం చేశారని కిషన్ రెడ్డి ఏ అధారాలతో ఆరోపణలు చేశారో చెప్పాలన్నారు. నేడు (మార్చి 21వ తేదీన) రెండో రోజు విచారణకు హాజరైన కవిత తన తొమ్మిది ఫోన్లను ఈడీకి సమర్పించారని, మరి దీనిపై కిషన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. కవితకు కిషన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది వందకోట్ల స్కామ్ అయితే నీరవ్ మోడీ ఎన్ని కోట్ల స్కామ్ చేశారని ప్రశ్నించారు. ఏమీలేని అధారాలను చూపించి కవితను వేధిస్తున్నారని, తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తూనే ఉన్నారని వ్యాఖ్యానించారు. అదానీ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటే కేంద్రం ఏం చేస్తుందన్నారు. లలిత్ మోడీ, విజయ్ మాల్యా విదేశాలలో ఎంజాయ్ చేస్తున్నారని దాని గురించి మాట్లాడాలన్నారు. కేంద్రంలో బీజేపీ శాశ్వతం కాదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. కేంద్రానికి చాతనైతే విదేశాల్లో దాక్కున్న అవినీతిపరులును తీసుకుని రావాలని సవాల్ చేశారు.