»Kavitha And Magunta Are Interrogated Investigation Of The Case Will Be Completed
ED ON LIQUOR SCAM:కవిత, మాగుంటను విచారిస్తే.. లిక్కర్ స్కామ్ కేసు విచారణ పూర్తి:ఈడీ
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది.
Kavitha and Magunta are interrogated, investigation of the case will be completed
ED ON LIQUOR SCAM:ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (delhi liquor scam) విచారణ తుది దశకు చేరుకుందని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ed) రామచంద్ర పిళ్లై కస్టడీ విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపింది. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిని విచారిస్తే కేసు విచారణ ముగుస్తోందని పేర్కొంది. లిక్కర్ స్కామ్‌లో కవితను (kavitha) అనుమానితురాలిగా పేర్కొంది. ఇదివరకు ఆమె సాక్షిగా ఉన్న సంగతి తెలిసిందే. రామచంద్ర పిళ్లై కస్టడీని ఈ నెల 20వ తేదీ వరకు కోర్టు పొడగించింది. ఆ లోపు అందరితో విచారణ పూర్తి చేయాలని ఈడీని కోర్టు ఆదేశించింది.
కవితకు (Kavitha) ఈడీ (ed) ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (liquor scam) మరోసారి నోటీసులు జారీచేసింది. ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉంది. అనారోగ్య కారణాలను సాకుగా చూపి.. ఆమె హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో (supreme court) తాను వేసిన పిటిషన్‌పై ఈ నెల 24వ తేదీన విచారణ ఉందని కవిత (Kavitha) చెప్పారు. ఆ తర్వాత విచారణకు వస్తానని పేర్కొన్నారు. దీంతోపాటు ఇంట్లోనే (home) తనను విచారించాలని కోరారు. ఆమె విజ్ఞప్తిని ఈడీ (ed) అధికారులు తోసిపుచ్చారు. ఈ నెల 20వ తేదీన విచారణకు హాజరుకావాలని తేల్చిచెప్పారు.
లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూపులో (south group) కీ రోల్ పోషించిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి (magunta srinivasulu reddy) నోటీసు ఇచ్చింది. ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది. ఈ కేసులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవరెడ్డి (raghava reddy) అరెస్టై.. ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడిషీయల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 10వ తేదీన రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
లిక్కర్ స్కామ్‌లో ఇప్పటివరకు 11 మంది (11 members) అరెస్ట్ అయ్యారు. ఇండో స్పిరిట్స్ సంస్థ యజమాని సమీర్ మహేంద్ర (sameer mahendra) సెప్టెంబర్ 28వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అరబిందో గ్రూప్ – ట్రైడెంట్ లైఫ్ సైన్సెస్ పీ శరత్ చంద్రా రెడ్డిని (sharath chandra reddy) నవంబర్ 11వ తేదీన, పెర్నార్డ్ రిచర్డ్ కంపెనీకి చెందిన బినొయ్ బాబును నవంబర్ 11న.. అభిషేక్ బోయినపల్లి (abhishek) నవంబర్ 13వ తేదీన అరెస్ట్ చేశారు. విజయ్ నాయర్ నవంబర్ 13వ తేదీన.. బడ్డీ రిటెయిల్ సంస్థ డైరెక్టర్ అమిత్ అరోరాను (amith arora) నవంబర్ 29వ తేదీన.. ఫిబ్రవరి 8న గౌతమ్ మల్హోత్రా (gautham malhotra).. చారియట్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన రాజేష్ జోషి (rajesh joshi)ను ఫిబ్రవరి 9వ తేదీన.. ఫిబ్రవరి 11వ తేదీన మాగుంట రాఘవ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ అయ్యారు.