»Jana Sena Party Chief Wishes To Womens On Womens Day
Women’s Day ఎమ్మెల్సీ కవిత డిమాండ్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు
కల్వకుంట్ల కవిత (K Kavitha) చేస్తున్న డిమాండ్ కు జనసేన పార్టీ (JanaSena Party) అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మద్దతు పలికారు. కవిత చేస్తున్న డిమాండ్ నే పవన్ చేశాడు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని కోరాడు. ఇదే విషయమై తమ పార్టీ మేనిఫెస్టోలో ఉంచినట్లు తెలిపాడు.
తెలంగాణ ఎమ్మెల్సీ, భారత జాగృతి వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత (K Kavitha) చేస్తున్న డిమాండ్ కు జనసేన పార్టీ (JanaSena Party) అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మద్దతు పలికారు. కవిత చేస్తున్న డిమాండ్ నే పవన్ చేశాడు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలి అని కోరాడు. ఇదే విషయమై తమ పార్టీ మేనిఫెస్టోలో ఉంచినట్లు తెలిపాడు. ప్రపంచ మహిళల దినోత్సవం సందర్భంగా పవన్ కల్యాణ్ మహిళలకు శుభాకాంక్షలు తెలిపాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘చట్టసభలతో పాటు అన్ని చోట్ల మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే. మహిళా రిజర్వేషన్ల అంశాన్ని పార్టీ ఎన్నికల ప్రణాళికలో పొందుపరిచాం. మహిళల రిజర్వేషన్లు సాధించే విషయంలో నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుంది. స్త్రీ సంపూర్ణ సాధికారత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి’ అని పవన్ తెలిపాడు. ‘సృష్టిలో సగభాగం మహిళ, ప్రతీ మనిషి జీవితంలో కీలకపాత్ర పోషించే ఆడపడుచులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంపూర్ణ స్త్రీ సాధికారత సాధించాలని ఆకాంక్షిస్తున్నాం’ అని జనసేన పార్టీ పోస్టు చేసింది.
‘శక్తి స్వరూపిణీ స్త్రీ.. బహుకృత రూపిణి స్త్రీ.. బహుముఖ ప్రజ్ణాశాలి స్త్రీ.. మానవ సృష్టికి మూలకారిణి స్త్రీ.. ఇంతటి మహెన్నతమైన స్త్రీకి మనం ఏమిస్తే రుణం తీరుతుంది. తల్లిగా.. బోబుట్టువుగా.. భార్య.. బిడ్డగా.. భిన్నరూపాలలో మన మధ్య ఉన్న స్త్రీమూర్తి సేవలు వెలకట్టలేనివి. మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిది. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటాం. అది సత్యం. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయని నేను ధృడంగా విశ్వసిస్తాను. అయితే స్త్రీ సంపూర్ణ సాధికారత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి మన సమాజం, ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలి. మహిళలపై అఘాయిత్యాలు జరగని సమాజం ఆవిష్కృతం కావడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలి. స్త్రీ ఆర్థిక స్వావలంబనతో స్వశక్తిపై నిలబడాలన్నా, సాధికారత సాధించాలన్నా చట్టసభలలో వారి సంఖ్యా బలం పెరగవలసి ఉందని నేను ప్రగాఢంగా నమ్ముతాను. చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది. పార్టీ ఎన్నికల ప్రణాళికలలో పొందుపరిచిన విషయం అందరికీ తెలిసిందే. ఈ దిశగా నా రాజకీయ ప్రయత్నం చిత్తశుద్ధితో కొనసాగుతుందని మీకు విన్నవిస్తున్నా. మీకు శుభాలు కలగాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తున్నా’ అని పవన్ కల్యాణ్ లేఖలో పేర్కొన్నారు.
కాగా పవన్ మాట్లాడిన అంశాలపైనే తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ఉద్యమం చేస్తున్నది. 10వ తేదీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కవిత ధర్నా చేయనుంది. పార్టీలకు అతీతంగా మద్దతు కోరుతున్నది. ఈ క్రమంలోనే కవిత చేసిన డిమాండ్లను పవన్ ప్రస్తావించడంతో కవిత ఆందోళనకు పరోక్షంగా పవన్ మద్దతు తెలిపినట్టు అయ్యింది.