»Gujarat Cigarett As Prasad At Bhoot Mama Temple In Surat
Bhoot Mama Temple సిగరెట్ తో పూజ.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?
ఇక మగాస్ అనే మిఠాయిలు భూత్ మామకు సమర్పిస్తుంటారు. వాటిని సమర్పిస్తే తాము చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. మాగస్ మిఠాలు తమ వద్ద ఉంచుకుంటే మంచి ఉద్యోగం లభిస్తుందని కూడా నమ్ముతున్నారు.
భిన్న సంస్కృతులు, సంప్రదాయాలకు నెలవు మన దేశం. వివిధ జాతులతో విలసిల్లుతోంది. ముఖ్యంగా మన దేశంలో కొండ ప్రాంత జాతులు ఇంకా తమ ఆచార వ్యవహారాలు కొనసాగిస్తూ నాగరిక సమాజానికి దూరంగా ఉన్నాయి. తమకు ఉన్న దాంట్లోనే సంతృప్తికర జీవనం పొందుతున్నారు. వాళ్లు దేవుడిగా ప్రకృతినే కొలుస్తారు. లేదా వారి జీవనాన్ని మెరుగుపరిచిన ఒకరిని పూజిస్తారు. ఆ విధంగానే గుజరాత్ లోని వంజారా జాతి ప్రజలు భూత్ మామ అనే దేవుడిని పూజిస్తున్నారు. ఆ దేవుడికి ఇచ్చే ప్రసాదం ఏమిటో తెలుసా? సిగరెట్. దీంతోపాటు మాగాస్ అనే ప్రత్యేకమైన మిఠాయి నైవేద్యంగా అందిస్తారు. ఆ వివరాలు ఏమిటో తెలుసుకోండి..
గుజరాత్ లోని సూరత్ పట్టణంలో ఆదర్శ్ సొసైటీలో వంజారా ప్రజలు నివసిస్తున్నారు. ఆ ప్రాంతంలో భూత్ మామ అనే ఆలయం ఉంది. 130 ఏళ్ల కిందట వంజరుల ప్రజలు ఇక్కడ నివాసం ఏర్పరుచుకున్నారు. ఆ సమయంలో ఒక వంజర మరణించాడు. అతడి సమాధి నిర్మించి ఆలయంగా తీర్చిదిద్దారు. అప్పటి నుంచి ఆ ఆలయం వంజర భూత్ మామ అని పిలుస్తుంటారు. పర్వదినాల్లో వంజారాలు ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అయితే భూత్ మామకు సిగరెట్లు నైవేద్యంగా సమర్పించడం ఇక్కడి ఆనవాయితీ. అలా చేస్తే తమ కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇక మగాస్ అనే మిఠాయిలు భూత్ మామకు సమర్పిస్తుంటారు. వాటిని సమర్పిస్తే తాము చేస్తున్న పనిలో ఏకాగ్రత ఉంటుందని అక్కడి ప్రజలు విశ్వసిస్తుంటారు. మాగస్ మిఠాలు తమ వద్ద ఉంచుకుంటే మంచి ఉద్యోగం లభిస్తుందని కూడా నమ్ముతున్నారు. హోలీ పండుగ సందర్భంగా భూత్ మామ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సిగరెట్ వెలిగించడం.. నైవేద్యం సమర్పించడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.