SKLM: ఉద్దానం ప్రాంతంలో తలపెట్టనున్న కార్గో ఎయిర్పోర్ట్కు భూములు ఇవ్వలేమని పలాస మండలం బేతాళపురం గ్రామానికి చెందిన రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం కార్గో ఎయిర్పోర్ట్ ప్రత్యేక అధికారి వెంకటేశ్వరరావు ఆగ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. బాధిత రైతులు అంగీకరిస్తే లాంగ్ పూలింగ్ విధానంలో 25సెంట్లు భూమి ఇస్తామని ఆయన రైతులకు నచ్చచెప్పారు.