»Stampede At Gujarats Surat Railway Station Leaves 1 Dead Several Injured
Surat రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. ఒకరు మృతి, పలువురికి గాయాలు
దీపావళి పండగ కోసం స్వస్థలాలకు వెళ్లేందుకు సూరత్ రైల్వేస్టేషన్లో జనం బారులుతీరారు. ఓకే సమయంలో జనం ఎక్కువ మంది రావడంతో తొక్కిసలాట జరిగింది. దాంతో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు.
Stampede at Gujarat's Surat railway station leaves 1 dead, several injured
Surat: గుజరాత్లో విషాదం చోటు చేసుకుంది. సూరత్ (Surat) రైల్వేస్టేషన్లో తొక్కిసలాట జరిగింది. దీంతో ఒకరు చనిపోగా.. పలువురు గాయపడ్డారు. దీపావళి పండగ కోసం సూరత్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు వచ్చారు. ట్రైన్ ఎక్కేందుకు భారీగా జనం వచ్చారు. దాంతో తొక్కిసలాట జరిగింది.
గాయపడ్డ వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న వారిని రైల్వే శాఖ సహాయ మంత్రి దర్షన జర్దొష్ పరామర్శించారు. పండగ కోసం ముంబై, గుజరాత్, మధ్యప్రదేశ్లోని వివిధ ప్రాంతాలకు 7 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానం చేర్చేందుకు 46 పెయిర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతుంది. నిరంతరాయంగా 400 ట్రిప్పులు నడుస్తున్నాయని చీఫ్ పీఆర్వో సుమిత్ తెలిపారు.స్టేషన్లో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని వివరించారు. అడిషనల్ కౌంటర్లు కూడా తెరిచామన్నారు. స్టేషన్లో 165 ఆర్పీఎఫ్, జీఆర్పీ జవాన్లను మొహరించారని పేర్కొన్నారు.