»Annavaram Temple Implementing Traditional Ware Dress Code Compulsary
Annavaram అన్నవరంలో కొత్త నిబంధన.. ఇకపై అలా వస్తేనే దర్శనం
ఈ నిబంధన తెలియక వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఏ ఆలయాన్ని సందర్శించినా కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వచ్చేప్పుడే సంప్రదాయ వస్త్రాలతో వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గుర్తు చేస్తున్నారు. ఆలయ నిబంధనలు విధిగా పాటించాలని కోరుతున్నారు.
ఆధ్యాత్మిక క్షేత్రాలు ఆధ్యాత్మిక కళను కోల్పోతున్నాయి. ప్రశాంతతకు నిలయాలుగా ఉండాల్సిన ఆలయాలు జీవం కోల్పుతున్నారు. భక్తుల ప్రవర్తన, వారి వ్యవహారాలతో ఆలయాలు మసక బారుతున్నాయి. సందర్శించడానికి వచ్చే భక్తులు నియమ నిబంధనలు పాటించడం లేదు. ఆలయ పాలక మండలి కూడా వాటిపై శ్రద్ధ వహించకపోవడంతో ధర్మస్థలాలు అధర్మంగా కొనసాగుతున్నాయి. వెరసి అందరి నిర్లక్ష్యం కారణంగా ఆలయాలు ప్రాభవం కోల్పోతున్నాయి. ఇది గ్రహించి ఆలయ పవిత్రతను కాపాడడంతోపాటు భక్తులు పద్ధతిగా ఆలయ క్షేత్రంలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే భక్తులు సంప్రదాయ వస్త్రధారణ ధరించడం. భక్తులు, ముఖ్యంగా యువత ఆలయాలకు ఎలా పడితే అలా వస్తున్నారు. జీన్స్ లు, టీ షర్ట్స్, షార్ట్స్ తో సందర్శిస్తున్నారు. వీరిలో యువతులు కూడా టీ షర్ట్స్, ప్యాంట్స్, స్కర్ట్స్ వేసుకుని రావడంతో ఆలయాలు పవిత్రతను కోల్పోతున్నాయి. వీరందరినీ దృష్టిలో ఉంచుకుని సంప్రదాయ వస్త్రధారణ తప్పనిసరి చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ఆలయాల్లో ఈ నిబంధన కొనసాగుతుండగా.. తాజాగా అన్నవరంలో ఈ నియమాన్ని పక్కాగా అమలు చేయనున్నారు. సంప్రదాయ వస్త్రధారణ చేసుకుని వస్తేనే సేవలకు అనుమతి. ఆలయ మండలి ప్రకటించిన విధంగా రాకపోతే సేవలకు నిరాకరిస్తున్నారు.
ఏపీలోని కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో సత్యదేవుడి వ్రతం, నిత్య కల్యాణం, ఇతర పూజ కార్యక్రమాలకు భక్తులు సంప్రదాయ వస్త్రారణలో రావాలని మంగళవారం నుంచి విధిగా అమలు చేస్తున్నారు. 2019 జూలైలోని ఈ నిర్ణయం అమల్లోకి తీసుకువచ్చినా అధికారులు అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఇకపై ఈ నిబంధనను కచ్చితంగా అమలు చేయాలని ఆలయ ఇన్ చార్జ్ ఈవో చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశాలు జారీ చేశారు. వ్రతం, ఇతర పూజల్లో పాల్గొనే పురుషులు పంచె, కండువా, లేదా కుర్తా, పైజామా, మహిళలు చీర, కుర్తా, పైజమా, లంగావోణి తదితర వస్త్రాలు ధరించి రావాలని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. లేకపోతే భక్తులకు దర్శన భాగ్యం కలగదని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం పలువురిని వెనక్కి పంపించారు.
ఇకపై విధిగా ఈ నిబంధన అమలు చేస్తామని ఆలయ పాలక మండలి ప్రకటించింది. మరికొన్ని ఆలయాల్లో కూడా ఈ నిబంధనను పక్కాగా అమలు చేయాలని భావిస్తున్నాయి. త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అయితే ఈ నిబంధన తెలియక వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భక్తులు ఏ ఆలయాన్ని సందర్శించినా కూడా సంప్రదాయ వస్త్రధారణ ధరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వచ్చేప్పుడే సంప్రదాయ వస్త్రాలతో వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని గుర్తు చేస్తున్నారు. ఆలయ నిబంధనలు విధిగా పాటించాలని కోరుతున్నారు.