జనసేనాని పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. జూన్ 14 నుంచి ఉమ్మడి ఉభయ గోదావరి (Ubhaya godavari) జిల్లాల్లో 11 నియోజకవర్గాల్లో పవన్ యాత్ర కొనసాగనుంది. కాగా, పవన్ కల్యాణ్ తన యాత్రకు నేడు నామకరణం చేశారు. ప్రత్యేకంగా రూపొందించిన వారాహి వాహనం(Varahi vehicle)లో తాను చేస్తున్న యాత్రకు “జనసేన వారాహి విజయ యాత్ర(Vijaya Yatra) అని నామకరణం చేశారు. రేపు అన్నవరం (Annavaram) సత్యదేవుని దర్శనం అనంతరం పవన్ రాజకీయ యాత్ర లాంఛనంగా ప్రారంభం కానుంది. పవన్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను జనసేన పార్టీ (Janasena party) ఇప్పటికే రిలీజ్ చేసింది. పలు నియోజకవర్గాల్లో పవన్ కల్యాణ్ వారాహి యాత్రతో పాటు, సభలు కూడా నిర్వహించనున్నారు. కాగా, పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో ప్రత్యేక అంబులెన్స్ (Ambulance) ను కూడా తీసుకువస్తున్నారు.
దీనిపేరు జన హిత(Jana hita).ఇందులో తగిన వైద్య సదుపాయాలు ఏర్పాటు చేశారు.జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Janasena Chief Pawan Kalyan) వారాహి యాత్ర బుధవారంనుంచి ప్రారంభంకానుంది. సత్యదేవుని దర్శనంతో జనసేన వారాహి విజయ యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. వారాహి నుంచి పవన్ కళ్యాణ్ తొలి బహిరంగ సభ కత్తిపూడి కూడలిలో జరుగనుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రజలతో జనసేనాని సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజల కష్టాలు.. బాధలు తెలుసుకొనేందుకు ‘జనవాణి’ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఈ మేరకు అన్నవరం నుంచి నరసాపురం (Narasapuram) వరకూ వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఇప్పటికే అన్నవరం, కత్తిపూడి ప్రాంతాల్లో జనసేన శ్రేణులు, నాయకులు ఎంతో ఉత్సహంతో ఏర్పాట్లు చేస్తున్నారు. కత్తిపూడి నుంచి ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పలు నియోజకవర్గాల మీదుగా వారాహి యాత్ర సాగనుంది. పిఠాపురం(Pithapuram), కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా వారాహి భీమవరం (Bhimavaram) చేరనుంది. ప్రతి నియోజకవర్గంలో వివిధ వర్గాల ప్రతినిధులను కలిసి వారితో చర్చించాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించారు.