ఉచితంగా ఆధార్ కార్డు(Aadhaar card) అప్డేట్ చేసుకునేందుకు రేపటితో గడువు ముగియనుంది. ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు గడిచిన వారు ఆధార్‌ను తప్పనిసరిగా అప్డేట్ (Update) చేసుకోవాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. జూన్ 14లోగా మై ఆధార్ పోర్టల్‌లో ఉచితంగా వివరాలను అప్డేట్ చేసుకోవచ్చని పెర్కొన్నది. ఆధార్ కార్డులోని పేరు, అడ్రస్(address), పుట్టిన తేదీ, లింగం, ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ వంటివి ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఫొటో, ఐరిస్, బయోమెట్రిక్
(Biometric)వివరాల కోసం ఆధార్ సెంటర్లో రూ.50 ఫీజు చెల్లించి అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులు జారీ చేసి పదేళ్లు పూర్తియింది.
గత పదేళ్లుగా చాలామంది ఆధార్ కార్డులో ఎలాంటి అప్డేట్ చేయలేదు. తమ చిరునామాలు మారినా.. ఆధార్‌లో మాత్రం పాత అడ్రస్‌లనే కంటిన్యూ చేస్తున్నారు. అందుకే ఆధార్ కార్డు అప్డేట్ను కేంద్రం తప్పనిసరి చేసింది. ఆన్లైన్ ఉచితంగా అప్డేట్ చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. https://myaadhaar.uidai.gov.in లో ఫ్రీగా అప్డేట్ చేసుకోవచ్చు. మీసేవా కేంద్రా(Meseva center)లలో అయితే..రూ.50 ఛార్జీ చెల్లించడం తప్పనిసరి. myAadhaar పోర్టల్‌లో ఉచితంగా అప్డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది కూడా బుధవారంలోపు మాత్రమే.
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) నిబంధనల ప్రకారం ప్రతి పదేళ్లకోసారి ఆధార్ అప్ డేట్ చేసుకోవాలి. ఈ క్రమంలో, ఆధార్ వివరాలు ఉచితంగా అప్ డేట్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. మై ఆధార్ పోర్టల్ (My Aadhaar Portal)ద్వారా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. మార్చి 15 నుంచి ఇది అమలులో ఉంది. ఈ గడువు ముగిసిన తర్వాత వినియోగదారులు ఆధార్ అప్ డేట్ కోసం రుసుం చెల్లించాల్సి ఉంటుంది. https://myaadhaar.uidai.gov.in పోర్టల్ లోకి లాగిన్ కావడం ద్వారా రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్(Mobile no)సాయంతో ఆధార్ ను ఎవరైనా అప్ డేట్ చేసుకోవచ్చు. అయితే, మార్పులు, చేర్పులకు సంబంధించి నిర్దేశిత పత్రాలు సమర్పించడం తప్పనిసరి.