Layoffs at US: అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. గత నెలలో రికార్డు స్థాయిలో ఉద్యోగులకు పింక్ స్లిప్ ఇచ్చారు. ఆర్థిక మాంద్యం భయంతో అగ్రరాజ్య కంపెనీలు ఉద్యోగులకు బూస్టింగ్స్ ఇస్తున్నాయి. అమెరికా దేశ చరిత్రలో మే నెల రికార్డ్ క్రియేట్ చేసింది. గత నెలలో 80 వేల మంది ఉద్యోగులను తొలగించారు.
వీరంతా అమెరికాలో పనిచేస్తున్న వారే కావడం విశేషం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అమలు చేయడం వల్ల ఉద్యోగాల కోత తప్పడం లేదు. మరో 3,900 మంది ఐటీ ఉద్యోగులు జాబ్స్ కోల్పోయారు. మొత్తంగా మే నెలలో అమెరికాలో 85 వేల మంది జాబ్ కోల్పోయారు. అగ్రరాజ్యంలో పరిస్థితి ఇలా ఉంటే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఇండియాలో ఐటీ, ఇతర సంస్థల్లో లే ఆఫ్స్ కొనసాగుతోన్నాయి. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ డౌన్ అయ్యింది. అన్నీ కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకుంటూ వస్తున్నాయి. లే ఆఫ్స్ ప్రకటించాయి. ఇండియాలో కూడా ఉద్యోగాలు కోల్పోయారు. ఐటీ కాక.. ఇతర రంగాల్లో కూడా జాబ్స్ కోల్పోయారు.