Kavitha-Bandi Sanjay: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్- బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బండి సంజయ్ (Bandi Sanjay) ట్వీట్ చేశారు. ఆ వెంటనే కవిత కదనరంగంలోకి దిగారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు.
సొంత పార్టీలో మహిళా నేతలపైనే అకృత్యాలకు పాల్పడే గులాబీ కీచకులపై మౌనం
ఆడబిడ్డలను వేధించి పీడించి ప్రాణాలు తీసుకునే స్థితికి చేరినా ఆ నేతలపై చర్యలు శూన్యం
పోడు భూముల కోసం పోరుబాట పట్టిన ఆడబిడ్డల చేతికి సంకెళ్ళేసిన వైనం
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 13, 2023
‘గవర్నర్కు గౌరవం దక్కదు, ఆడబిడ్డలకు అండగా ఉండరు. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ, బతుకమ్మను అవమానించిన వాడితో ఆలింగనం, ఇంటిబిడ్డకు మాత్రం బలగంతో అడ్డం నిలబడతావ్.. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం అని’ బండి సంజయ్ (Bandi Sanjay) ట్వీట్ చేశారు. దీనికి కవిత (Kavitha) రిప్లై ఇచ్చారు.
పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం
దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు
దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం… https://t.co/V05XeA3vR5
‘పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి గౌరవం లభించదు. మహిళా రెజ్లర్లు ధర్నా చేస్తోన్నా పట్టించుకోరు. సదరు బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోరు. నినాదాలకే పరిమితమైన భేటీ బచావో.. బేటీ పడావో, సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళల కన్నీరు తెప్పిస్తోన్న పరిస్థితి. మహిళా విద్య, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం, ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్దే ముఖ్యం, ఆడబిడ్డ తలుచుకుంది, ఇక మీ అడ్రస్ గల్లంతు అవుతుంది’ అని కవిత (Kavitha) కౌంటర్ ట్వీట్ చేశారు. కవిత (Kavitha)- బండి సంజయ్ (Bandi Sanjay) ఇటీవల నిజామాబాద్లో ఓ ఫంక్షన్లో కలిశారు. వారిద్దరూ.. అన్న, అక్క అని పిలుచుకున్నారు. ఆ వెంటనే రాజకీయ యుద్దం మొదలైంది. పరస్పర ఆరోపణలతో మళ్లీ హీటెక్కింది.