»Agartala Dr Manik Saha Takes Oath Second Time As Tripura Chief Minister
Tripura రెండోసారి సీఎంగా మాణిక్ సాహ.. రెండు రోజులు అక్కడే ప్రధాని
వరుస కార్యక్రమాలతో ప్రధాని మోదీ మూడు రోజులుగా ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నారు. నిన్న నాగాలాండ్, మేఘాలయలో పర్యటించారు. తాజాగా త్రిపురలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటుచేయడంలో వ్యూహం రచించిన మోదీ ఇక ఢిల్లీకి పయనమయ్యాడు.
ఈశాన్య భారతంలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ప్రభుత్వాలు కొలువు దీరాయి. నాగాలాండ్, త్రిపుర (Tripura)లో స్పష్టమైన ఆధిక్యం తమ కూటమికిగా రాగా మేఘాలయాలో కూడా తనదైన వ్యూహంతో ఆ రాష్ట్రాన్ని కూడా తన బుట్టలో వేసుకుంది. దీంతో ఈశాన్య ప్రాంతం పూర్తిగా కమలమయమైంది. మంగళవారం నాగాలాండ్ (Nagaland), మేఘాలయ (Meghalaya) ప్రభుత్వాలు కొలువుదీరగా.. తాజాగా త్రిపురలో కూడా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. కాగా గత మూడు రోజులుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఈశాన్య భారతంలోనే ఉన్నారు. మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను నిలబెట్టడంపైనే పూర్తి దృష్టి సారించారు. ఈ సందర్భంగా రాజకీయ వ్యూహలు రచించి మూడింటికి మూడు రాష్ట్రాలను కమలం ఖాతాలో వేశారు.
మంచి వైద్యుడిగా పేరు పొందిన మాణిక్ సాహా (Manik Saha) రెండోసారి త్రిపుర ముఖ్యమంత్రి (CM)గా బుధవారం బాధ్యతలు చేపట్టాడు. గవర్నర్ సత్యదేశ్ నారాయణ్ ఆర్య మాణిక్ సాహతో ప్రమాణం (Oath) చేయించారు. అగర్తలలో నిర్వహించిన ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తదితరులు తరలివచ్చారు. ఈ సందర్భంగా అగర్తలలోని వివేకానంద మైదాన్ లో బహిరంగ సభ నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party)లో ఎదిగిన మాణిక్ సాహ 2016లో ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. 2020లో పార్టీ త్రిపుర అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. మార్చి 2022లో రాజ్యసభకు నియమితుడయ్యాడు. అయితే గతేడాది అనూహ్యంగా త్రిపుర ముఖ్యమంత్రి (Cheif Minister)గా మాణిక్ సాహ ఎన్నికయ్యాడు. కాగా తాజాగా జరిగిన ఎన్నిక (Elections)ల్లో మొత్తం 60 స్థానాల్లో బీజేపీ తన మిత్రపక్షం (ఐపీఎఫ్ టీ)తో కలిసి 32 స్థానాల్లో కూటమి విజయం సాధించింది. బీజేపీ ఏకంగా 31 స్థానాలు సొంతం చేసుకుంది. 13 సీట్లను కైవసం చేసుకున్న తిప్ర మోత (Tipra Motha) పార్టీ రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. సీపీఐ(ఎం) 11 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ మూడు స్థానాల్లో గెలుపొందింది.
కాగా తాజాగా ఏర్పాటైన ప్రభుత్వ లక్ష్యం ‘ఉన్నత త్రిపుర.. శ్రేష్ట త్రిపుర’గా రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ప్రకటించింది. ప్రమాణానికి ముందు మాణిక్ సాహ శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కాగా వరుస కార్యక్రమాలతో ప్రధాని మోదీ మూడు రోజులుగా ఈశాన్య ప్రాంతంలోనే ఉన్నారు. నిన్న నాగాలాండ్, మేఘాలయలో పర్యటించారు. తాజాగా త్రిపురలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రభుత్వాలను ఏర్పాటుచేయడంలో వ్యూహం రచించిన మోదీ ఇక ఢిల్లీకి పయనమయ్యాడు.