Rinky Chakma: త్రిపురకు చెందిన అందాల సుందరి రింకీ చక్మా క్యాన్సర్తో కన్నుమూశారు. 29 ఏళ్ల రింకీ రెండేళ్ల నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతుంది. మృత్యువుతో పోరాడి చనిపోయిందీమె. 2017 మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని ఫైనలిస్టుగా నిలిచింది. రింకీ 2022లో బ్రెస్ట్ క్యాన్సర్ బారినపడిన అనంతరం ట్రీట్మెంట్ తీసుకున్నారు. అయితే ఈ వ్యాధి ఊపిరితిత్తులు, తలకు చుట్టుకుంది. దీంతో ఆమెకు చికిత్స అందినా ప్రయోజనం లేకపోయింది. ఫిబ్రవరి 22న ఒక్కసారి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. ఎప్పుడు అనారోగ్యం కోసం బయటకు చెప్పని రింకీ కొన్ని రోజుల క్రితం పోస్టు పెట్టి, ఆర్థిక సహాయం అడిగారు. కానీ చివరకు చనిపోయారు. ఈ విషయాన్ని మిస్ఇండియా ఆర్గనైజేషన్ తెలిపింది.