Lok Sabha Elections: సార్వత్రిక ఎన్నికలకు రెండో విడుత నోటిఫికేషన్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం రెండో దశ ఎన్నికల్లో భాగంగా 88 స్థానాలకు నోటిఫికేషన్‌ను ఈసీ విడుదల చేసింది. రెండో విడుతలో ఔటర్ మణిపూర్‌లోని ఒక సీటుతోపాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఎంపీ స్థానాల్లో ఏప్రిల్ 26న పోలింగ్ జరగనుంది. రెండో విడుత నామినేషన్లు ఏప్రిల్ 4 వరకు దాఖలు చేయవచ్చు. జమ్ము కశ్మీర్ మినహా 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 5న జరుగనుంది.
జమ్మూకశ్మీర్‌లో మాత్రం ఏప్రిల్ 6న నామపత్రాలను పరిశీలిస్తారు. రెండో విడుతలో అస్సాం, బీహార్, ఛత్తీస్‌గఢ్, జమ్మూకశ్మీర్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్, మణిపూర్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటితోపాటు మహారాష్ట్రలోని అకోలా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం, రాజస్థాన్‌లోని భాగిడోరా అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నికలు జరుగుతాయి. అయితే మొదటి విడుత నోటిఫికేషన్‌ను మార్చి 20న విడుదల అయ్యింది. మొత్తం 102 ఎంపీ స్థానాలకు ఏప్రిల్ 19ప ఎన్నికలు జరుగనున్నాయి.