తెలంగాణ ఎన్నికల సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొంది. రాష్ట్రానికి చెందిన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి (Nallu Indrasena Reddy) ని త్రిపుర గవర్నర్‌గా నియమించింది. రాష్ట్రప్రతి ఉత్తర్వులు జారీ చేసింది.నల్లు రాంరెడ్డి దంపతులకు 1953 జనవరి 1న జన్మించిన ఇంద్రసేనా రెడ్డి.. హైదరాబాద్ నగరంలోని మలక్ పేట నియోజకవర్గం (MalakPeta Constituency) నుంచి 1983,1985,1999 లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. బీజేపీ (BJP), టీడీపీ పొత్తులో భాగంగా ఆయన రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బీజేపీ శాసన సభ పక్ష నేతగా వ్యవహారించారు. నల్లు ఇంద్రసేనా రెడ్డి 2003లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కూడా వ్యవహారించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శగా 2014 నుంచి వ్యవహారిస్తున్నారు. 2020 బీజేపీ జాతీయ కమిటీ ప్రత్యేక ఆహ్వానితులుగా నియమితులయ్యారు.
జార్ఖండ్ (Jharkhand) రాష్ట్ర మాజీ సీఎంగా సేవలందించిన రఘుబర్ దాస్‌ను కూడా ఒడిశా రాష్ట్ర గవర్నర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయినట్లు రాష్ట్రపతి కార్యాలయం ప్రకటనలో పేర్కొంది. 2004లో నల్గొండ, 2014లో భువనగిరి లోక్‌సభ స్థానాలకు పోటీ చేసి ఓడిపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్బీజేపీ అధ్యక్షులుగా పనిచేసిన వి.రామారావు, సీహెచ్ విద్యాసాగర్‌రావు, బండారు దత్తాత్రేయల తర్వాత ఇంద్రసేనారెడ్డి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కంభంపాటి హరిబాబు ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా, బండారు దత్తాత్రేయ (Dattatreya) హరియాణా గవర్నర్‌గా ఉన్నారు. ఇంద్రసేనారెడ్డి నియామకంతో తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గవర్నర్ల సంఖ్య మూడుకు చేరింది. కొంతకాలం క్రితం ముషీరాబాద్ మాజీ ఎమ్మెల్యే డా. కే. లక్ష్మణ్ (K. Lakshman) కు రాజ్యసభ సీటును కేటాయించిన కేంద్రం ఇపుడు రాష్ట్రానికి చెందిన మరో సీనియర్ నేత నల్లుకు గవర్నర్ పదవీ కేటాయించటంతో తెలంగాణ రాష్ట్రంపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టిందనే చర్చ జరుగుతుంది