ADB: బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఆదివారం తెల్లవారుజామున బోథ్ ఎక్స్ రోడ్డు వద్ద ఆగి ఉన్న లారీని మరో ఎదురుగా వస్తున్న లారీ డీ కొంది. ఈ ప్రమాదంలో ఓ లారీ ముందు భాగం ద్వంసం కాగా.. మరో లారీ అదుపు తప్పి రోడ్డు పక్కకి దూసుకెళ్లి నిలిచి పోయింది. ఈ ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.