»I Didnt Like The Rrr Movie Natu Natu Song Where Is The Music In It Keeravanis Father Shiv Shakti Dutta Comments
Natu Natu Song నచ్చలేదు..అందులో సంగీతం ఎక్కడుంది: కీరవాణి తండ్రి
ఆర్ఆర్ఆర్(RRR) చిత్రంలో నాటు నాటు(natu natu song) పాట అసలు నచ్చలేదు కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(Shiv Shakti Dutta) పేర్కొన్నారు. అందులో సంగీతం ఎక్కడుంది, ఇది కూడా ఓ సంగీతమా అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వ్యాఖ్యలు చేశారు. తాను కూడా గతంలో అనేక చిత్రాలకు పాటలు రాసినట్లు తెలిపారు.
RRR మూవీలో నాటు నాటు సాంగ్(natu natu song) తనకు నచ్చలేదని కీరవాణి తండ్రి శివశక్తి దత్తా(Shiv Shakti Dutta) అభిప్రాయం వ్యక్తం చేశారు. అందులో సంగీతం ఎక్కడుంది, దాన్ని కూడా ఓ మ్యూజిక్ అంటారా అని తెలిపారు. కానీ ప్రేమ్ రక్షిత్ అందించిన కొరియోగ్రఫీ మాత్రం బాగుందన్నారు. ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. అయితే హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ చేసిన కృషి వల్లనే ఆ పాటకు గుర్తింపు దక్కినట్లు చెప్పారు. మొత్తానికి కిరవాణికి చాలా రోజల తర్వాత మంచి అవార్డు వచ్చినట్లు గుర్తు చేశారు. అంతేకాదు కీరవాణి అంటే తనకు చాలా ఇష్టమని, మూడో సంవత్సరం నుంచే తనకు మ్యూజిక్ గురించి అవగాహన కల్పించినట్లు వెల్లడించారు.
మరోవైపు తనకు సినిమాలంటే ఇష్టమని చెప్పారు. తాము నలుగురు సోదరులమని(brothers తెలిపారు. ఒకనొక సమయంలో తుంగభద్ర ప్రాంతానికి వలస వెళ్లినట్లు వెల్లడించారు. అక్కడ 16 సంవత్సరాలు ఉన్నామని ఆ క్రమంలో 300 ఎకరాల భూమి(land) కొన్నట్లు తెలిపారు. కానీ మూవీల కోసం భూమిని మొత్తం అమ్మినట్లు చెప్పుకొచ్చారు. చివరకు ప్రతి రోజు పూట గడవడం కూడా కష్టంగా ఉండేదని గుర్తు చేసుకున్నారు. అదే సమయంలో విజేయేంద్రప్రసాద్, తాను కలిసి మంచి స్టోరీలు రాసినట్లు చెప్పారు. జానకిరాముడు, కొండవీటి సింహం సహా అనేక హిట్టు చిత్రాలను పనిచేసినట్లు వెల్లడించారు.
ఎస్ఎస్ రాజమౌళి విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్(RRR). ఈ మూవీలో గల ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు(oscars 2023) వరించింది. ఆ మూవీ టీమ్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. అవార్డు రావడంపై ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు గెలుచుకొని భారతీయులను గర్వపడేలా చేశారని ట్వీట్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, సింగర్స్ కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, గేయ రచయిత చంద్రబోస్, సినిమా దర్శకుడు రాజమౌళి, నటులు ఎన్టీఆర్, రాంచరణ్ పేర్లను రాసి మరీ విష్ చేశారు. మొత్తం సినిమా టీమ్‌కు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. అవార్డుతో అంతర్జాతీయ స్టేజ్‌పై దేశానికి మంచి పేరు వచ్చిందని కామెంట్ చేశారు. మరిన్ని అవార్డులను గెలుచుకోవాలని ఆకాంక్షించారు.