సత్యసాయి: రొళ్ల మండలం వడ్రహట్టి గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అదృశ్యమయ్యారు. తాపీ మేస్త్రి వీరేశ్ మద్యానికి బానిసై తరచూ భార్యతో గొడవ పడేవాడు. ఫిబ్రవరి 27న జరిగిన గొడవతో అతడి తల్లి సుబ్బమ్మ, భార్య లక్ష్మి, ఇద్దరు కుమార్తెలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. బంధువుల ఫిర్యాదుతో ఎస్సై గౌతమి కేసు నమోదు చేశారు.