HYD Metro:ఎండలు మండిపోతున్నాయి. ఇంటి నుంచి బయటకు కాలు పెడదామంటే భయపడాల్సిన పరిస్థితి. అందరికీ కార్లు ఉండవు కదా.. అందుకే బస్సులు (buses), ఆటోల (auto) కన్నా.. మెట్రో వైపు చూస్తున్నారు. వీక్ డేస్‌లో మెట్రోకి (metro) భారీ డిమాండ్.. ఐటీ కొలువులు చేసేవారితో మెట్రోలో (metro) ప్లేస్ ఉండదు. ఇప్పుడు సమ్మర్ హీటెక్కడంతో అంతా మెట్రో వైపే చూస్తున్నారు. ఇదిగో అమీర్ పేట (ameerpeta) మెట్రో స్టేషన్లో పరిస్థితి ఉంది. ఈ వీడియో ఓసారి మీరు చూడండి.
అమీర్ పేట మెట్రో స్టేషన్లో ఇసుక వేస్తే రాలని పరిస్థితి. అందరూ మెట్రోలో (metro).. చల్లని ఏసీ (AC) మధ్య ట్రావెల్ (travel) చేయాలని అనుకుంటున్నారు. వారం రోజుల నుంచి ఇక్కడ రోజుకు 4.50 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిసింది. కెపాసిటీకి మించి ట్రావెల్ చేస్తున్నారు. ఇదీ ప్రమాదకరం కావడంతో.. మెట్రో సర్వీసులు (metro service) పెంచాలని ప్యాసెంజర్స్ (passengers) డిమాండ్ చేస్తున్నారు. స్పెషల్ డే, ప్రత్యేక సందర్భం ఉంటేనే మెట్రో సర్వీసులు వేస్తారు. ఈ మధ్య ఐపీఎల్ కోసం వేశారు. ఎండలను దృష్టిలో ఉంచుకొని వేస్తే జనాలకు సర్వీస్ చేసినట్టు.. సంస్థకు లాభాలు కూడా వస్తాయి.
బస్సు (bus), ఎంఎంటీఎస్‌తో (mmts) పోలిస్తే మెట్రో చార్జీ కాస్త ఎక్కువే.. అయినప్పటికీ చల్లదనం కోసం జనం ట్రావెల్ చేసేందుకు వస్తున్నారు. వారికి సర్వీస్ చేయడంలో మెట్రో అధికారులు (metro officials) ఉన్నారు. వీలును బట్టి సర్వీసులు పెంచుతామని చెబుతున్నారు.
జనం మెట్రోకు (metro) అలవాటు పడ్డారు. ఇదివరకు ఉచితంగా (free) అందించిన సేవలను ఇప్పుడు ఖరీదు చేస్తున్నారు. మెట్రో స్థలాల్లో ఇప్పటివరకు ఫ్రీ పార్కింగ్ (free parking) ఉండేది.. దానిని విత్ డ్రా చేసింది. మెట్రో సర్వీస్ ప్రారంభించిన సమయంలో చార్జీ (charge) వసూల్ చేయడంతో జనం ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు మెజార్టీ పీపుల్ రావడంతో మళ్లీ పార్కింగ్‌కు (parking) డబ్బులు వసూల్ చేస్తున్నారు.
ఒక పార్కింగ్ కాదు డిస్కౌంట్లను (discount) కూడా తగ్గించింది. టికెట్లపై ఇచ్చే రాయితీ, కాంటాక్ట్ లెస్ స్మార్ట్ కార్డులు, డిజిటిల్ క్యూఆర్ టికెట్లపై గల 10 శాతం (10 percent) డిస్కౌంట్‌ను తీసివేసింది. మెట్రో రైలు.. పరిసరాల్లో మాల్స్‌లో ఫ్రీ పార్కింగ్ కూడా ఇప్పుడు లేదు. అయినప్పటికీ ఏసీ చల్లనిగాలి కోసం మెట్రోలో ట్రావెల్ చేసేందుకు ప్రయాణికులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.