Mp kanakamedal ravindra:ఏపీ సీఎం జగన్పై (jagan) టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర (kanakamedal ravindra) నిప్పులు చెరిగారు. ఓ ఫ్యాక్షనిస్టుకు అధికారం వచ్చిందని.. దీంతో అర్ధరాత్రి పురుషులు (men) కూడా స్వతంత్రంగా తిరగని పరిస్థితి నెలకొందన్నారు. శాంతి భద్రతలు మరింత దిగజారాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన కన్నా.. జగన్ (jagan) సీఎం అవడంతో ఎక్కువ నష్టపోయిందని చెప్పారు. చంద్రబాబు (chandrababu) పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
అబద్దాలు చెప్పి జగన్ (jagan) అధికారంలోకి వచ్చారని కనకమేడల (kanakamedala) అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని పేర్కొన్నారు.మాజీమంత్రి వివేకానంద (viveka) హత్యను చంద్రబాబుకు ఆపాదించాలని జగన్ (jagan) చూశారని కనకమేడల పేర్కొన్నారు. వివేకా (viveka) హత్యకు సంబంధించి అధికారంలో లేనప్పుడు ఒకవిధంగా.. అధికారంలోకి వచ్చిన తర్వాత మరోలా మాట్లాడారని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో సీబీఐ (cbi) విచారణ కోరి.. తమ ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ప్రభుత్వమే విచారణ చేస్తోందని తెలిపారు. జగన్పై (jagan) నమ్మకం లేక వివేకా కూతురు సునీత (sunitha) సీబీఐ విచారణ కోరారని గుర్తుచేశారు.
వివేకానంద (viveka) హత్య వెనక ఎవరు ఉన్నారనేది ఏపీ ప్రజలు గ్రహించాలని కనకమేడల అన్నారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని చెప్పారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు, పెన్షన్లు కూడా ఇవ్వలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం తథ్యం అన్నారు. జగన్ ప్రభుత్వంపై ప్రజలు అసహనంతో ఉన్నారని వివరించారు.