Vizag steel plant bid time is over, telangana government not participate
Vizag steel plant:విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) ఇవోఐ బిడ్డింగ్ గడువు ఈరోజుతో ముగిసింది. వాస్తవానికి 5 రోజుల క్రితమే గడువు ముగిసినప్పటికీ.. ఏ సంస్థ/ ప్రభుత్వాలు ఇంట్రెస్ట్ చూపిస్తాయెమోనని గడువు పెంచింది. అయినప్పటికీ ప్రభుత్వం సంస్థలు/ ప్రభుత్వ ఆధీనంలో గల సంస్థలు పాల్గొనలేదు. ఈ మేరకు బిడ్డింగ్ గడువు ముగిసిందని విశాఖ స్టీల్ ప్లాంట్ (vizag steel plant) యజమాన్యం ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కాలరీస్ పేరుతో బిడ్ వేస్తుందని అంతా భావించారు. కానీ బిడ్డింగ్‌కు దూరంగా ఉంది. ఏపీ ప్రభుత్వం కూడా దూరంగా ఉంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) ప్రైవేటీకరణపై రగడ జరిగిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ (cm kcr) మాట్లాడటంతో కేంద్రమంత్రి ప్రకటన చేశారు. ఏపీ, తెలంగాణ నేతల మధ్య డైలాగ్ వార్ జరిగింది. విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి అధ్యయనం చేయాలని సింగరేణి అధికారుల బృందం పర్యటించింది. సీఎం కేసీఆర్‌కు (cm kcr) నివేదిక సమర్పించింది. సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత బిడ్ వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. సింగరేణి కాలరీస్ బిడ్ వేస్తుందెమోనని.. గడువు 5 రోజులు పెంచారు.
అంతకుముందు విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) కార్మికులతో బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ (chandrasekhar) చర్చలు జరిపారు. తెలంగాణ ప్రభుత్వం బిడ్ వేస్తుందని తెలిపారు. మీకు అండగా ఉంటామని చెప్పారు. కానీ కేంద్ర ప్రభుత్వం నిబంధనలు.. సింగరేణి అధికారుల రిపోర్ట్ నేపథ్యంలో బిడ్‌పై తెలంగాణ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.
స్టీల్ ప్లాంట్ కోసం మొత్తం 22 కంపెనీలు (22 companies) బిడ్ దాఖలు చేశాయి. ఇవీ అన్నీ ప్రైవేట్ సంస్థలే కావడం విశేషం. 22 కంపెనీల్లో 6 అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి. అయినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్ (Vizag steel plant) యజమాన్యం.. కార్మికులు వాటిపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బిడ్డింగ్‌లో సీబీఐ మాజీ డీజీ లక్ష్మీనారాయణ (laxmi narayana) కూడా పాల్గొన్నారు.