Keerthy suresh:ఫ్యాన్స్‌తో చాట్ చేస్తుండగా కీర్తి సురేష్‌కు (Keerthy suresh) ఎప్పుడూ వచ్చే ప్రశ్న తలెత్తింది. పెళ్లెప్పుడు అని ఓ అభిమాని (fan) అడగగా.. ఆమె కూడా అలానే సమాధానం చెప్పింది. వడివేలు కార్టూన్.. రెండు జేబుల్లో ఏముంది.. ఏమి లేదు అనే ఫోటో పెట్టింది. దీంతో కీర్తి ఫ్యాన్స్ అందరికీ సిచుయేషన్ అర్థమైపోయింది. ఇప్పట్లో పెళ్లి (marriage) లేదని కన్ఫామ్ అయిపోయింది.
హీరోయిన్స్ మంచి హిట్స్ కొట్టిన సమయంలో పర్సనల్ లైఫ్ (personal life) గురించి ప్రశ్నలు వస్తుంటాయి. మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తి గెలుచుకున్నారు. ఆ తర్వాత ఆమె సినిమాలు ఏమీ ఆడలేదు. ఇటీవల వచ్చిన దసరా (dasara) మూవీ కాస్త ఫర్లేదు అనిపించింది. ఇప్పుడు ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ.. ఫ్యాన్స్‌తో అప్పుడప్పుడూ చాట్ చేస్తుంటారు.
ఓ బిజినెస్‌మెన్‌తో కీర్తి (Keerthy) పెళ్లి అని వార్తలు వస్తుంటాయి. అవీ పుకార్లు అని ఈసారి కీర్తి (Keerthy) సమాధానం ఇచ్చారు. సో.. ఇక అభిమానులు ఆమెను మరోసారి పెళ్లి (marriage) గురించే అడిగే అవకాశం లేదు.
తెలుగుతోపాటు (telugu) తమిళంలో (tamil) కూడా కీర్తికి (keerthy) స్టార్ డమ్ ఏర్పడింది. అందుకే అక్కడ సినిమాలు చేస్తున్నారు. ఉదయనిధి స్టాలిన్‌తో ఓ మూవీ, జయం రవితో (jayam ravi) మరో మూవీ కీర్తి సురేష్ (Keerthy) చేస్తున్నారు. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) భోళా శంకర్ మూవీలో కీర్తి నటిస్తోన్న సంగతి తెలిసిందే.