ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ ప్రతిపక్ష హోదాపై ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పీకర్‌కు బహిరంగ లేఖ రాశారు. దీంతో ఈ విషయమై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడున్నాయి.
YS Jagan: Taking oath with me after ministers is against traditions
Jagan Letter : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కేవలం 11 సీట్లు మాత్రమే ఉన్న వైసీపీ పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుందని ఏపీ మంత్రులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై వైసీపీ అధినేత జగన్మోహన్రెడ్డి(ys jagan mohan reddy) బహిరంగంగా స్పీకర్ అయ్యన్నపాత్రుడికి( Ayyanapatrudu) లేఖ రాసిన విషయం తెలిసిందే. సభ సీట్లలో పది శాతం సీట్లు ఉంటేనే ఆ పార్టీకి నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా లభిస్తుంది. అయితే జగన్ మాత్రం ఇప్పుడు ఈ విషయంలో భిన్నంగా స్పందిస్తున్నారు. తానే ప్రతిపక్ష నేతనని చెబుతున్నారు. బలం లేకున్నా తమకు ప్రతిపక్ష హోదా కల్పించాల్సిందేనని ఆయన లేఖలో రాసిన సంగతి అందరికీ తెలిసిందే.
అయితే ఈ విషయమై ప్రస్తుత ఏపీ మంత్రులు సెటైర్లు వేస్తున్నారు. గత ఐదేళ్లలో జగన్( Jagan) ప్యాలెస్‌ల్లో కాకుండా ప్రజల్లో ఉండి ఉంటే ఇప్పుడు ఇలాంటి దుస్థితి వచ్చేది కాదంటూ చెబుతున్నారు. ఇలా స్పీకర్‌కు లేఖలు రాసే అవసరం రాకపోయేదని అంటున్నారు. వైసీపీ ఘోరంగా ఓడిపోయినా చంద్రబాబు పెద్ద మనసుతో అసెంబ్లీలో ఆయనకు గౌరవం కల్పించారని చెబుతున్నారు. అర్హత లేకపోయినా జగన్ వాహనాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి రానిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ విషయమై మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. స్పీకర్‌కు లేఖ రాయడం నిజంగా విడ్డూరంగా ఉందన్నారు. అక్షర క్రమంలో ప్రమాణ స్వీకారం చేయాల్సిన జగన్(Jagan) వైసీపీ నేతల అభ్యర్థనతో ముందే ప్రమాణ స్వీకారం చేసేందుకు అనుమతించినట్లు చెప్పారు. ప్రజలే వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అన్నారు. ఈ విషయంలో వారు టీడీపీ మీద పడి ఏడవడం ఏమిటని ప్రశ్నించారు. బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా వారు వ్యవహరించాలని కోరారు. అలా లేకపోతే ఇప్పుడున్న క్రికెట్ టీం కాస్తా వాలీబాల్ టీం అవుతుందంటూ హెచ్చరించారు.