Sidda Ramaiah : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సద్ధరామయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విరూపక్షను అరెస్టు చేయాలంటూ ఆయన తన పార్టీ నేతలతో కలిసి డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు, ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మాదాల్ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన ఉదంతం రాష్ట్రవ్యాప్త సంచలనం రేపింది.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సద్ధరామయ్యను పోలీసులు అరెస్టు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే విరూపక్షను అరెస్టు చేయాలంటూ ఆయన తన పార్టీ నేతలతో కలిసి డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు, ఈ క్రమంలో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్ష కుమారుడు ప్రశాంత్ మాదాల్ నిన్న రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ లోకాయుక్త అధికారులకు పట్టుబడిన ఉదంతం రాష్ట్రవ్యాప్త సంచలనం రేపింది.
అతని ఇంటి నుంచి అధికారులు రూ. 6 కోట్లకు పైగా నగదును, అతని కార్యాలయం నుంచి మరో 1.7 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఇది సామాన్య విషయం కాదని, ఈ ఉదంతానికి నైతిక బాధ్యత వహించి సీఎం బసవరాజ్ బొమ్మై రాజీనామా చేయాలని సిద్దరామయ్య డిమాండ్ చేశారు.
రేస్ కోర్స్ రోడ్ లోని సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో బెంగుళూరు సిటీలో శనివారం చాలాసేపు హైడ్రామా నడిచింది. మీది అవినీతిరహిత ప్రభుత్వమని బొమ్మై చాటుకుంటున్నారని, కానీ జరుగుతున్నదేమిటని సిద్దరామయ్య ప్రశ్నించారు. విరూపాక్షను అరెస్టు చేసి తీరవలసిందేనన్నారు. ప్రతి పనికి కాంట్రాక్టర్లు 40 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని మేము ఆరోపిస్తున్నప్పుడల్లా మీరు ఆధారాలు చూపాలని కోరుతున్నారని, ఈ ఉదంతం మీకు చాలదా అని ఆయన బొమ్మైని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రతి రంగంలోనూ అవినీతి వ్యాపించిందన్నారు.