»Dr Br Ambedkar Vision Aided Telangana State Formation Says Minister Kt Rama Rao
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ లేకుంటే Telangana రాష్ట్రం లేదు: KTR
అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు. సచివాలయానికి పేరు పెట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యం.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (Dr BR Ambedkar) జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆయనకు వాడవాడలా ప్రజలు, నాయకులు ఘన నివాళులర్పిస్తున్నారు. దేశానికి, ముఖ్యంగా దళిత జాతికి అంబేడ్కరుడు చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి అంబేడ్కర్ కారణమని తెలంగాణ మంత్రి కేటీఆర్ (KT Rama Rao) అన్నారు. అంబేడ్కర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదని పేర్కొన్నారు.
హైదరాబాద్ (Hydrabad)లోని పంజాగుట్ట (Punjagutta) చౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అనంతరం విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘అంబేడ్కర్ చెప్పిన విధంగా ప్రజలకు అన్యాయం జరిగితే పోరాడుతూ ముందుకు వెళ్తున్నాం. సీఎం కేసీఆర్ దమ్మున్న నాయకుడు. సచివాలయానికి పేరు పెట్టడం సీఎం కేసీఆర్ కే సాధ్యం. ఆయన తీసుకొచ్చిన దళితబంధు పథకం (Dalitbandhu Scheme) సాహసోపేతమైనది. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అందరికీ గర్వకారణం. శతాబ్దాల పాటు దిశానిర్దేశం చేసేలా అంబేడ్కర్ (Ambedkar Statue) భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం’అని కేటీఆర్ తెలిపారు.
ఇక కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ (New Parliament) భవనానికి అంబేడ్కర్ పెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి (Narendra Modi) కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. స్థానికుల డిమాండ్ మేరకు పంజాగుట్ట కూడలికి అంబేడ్కర్ పేరు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మహమూద్ అలీ, ఇతర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, కొప్పుల ఈశ్వర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.