అన్నమయ్య: మదనపల్లి కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన PGRS కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీలను పెండింగ్లో ఉంచకుండా సకాలంలో పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి మొత్తం 346 అర్జీలు స్వీకరించగా, వాటిని నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.