»Daughters Burnt Her Father In Rajampet Kamareddy District
Daughters ఆస్తి కోసం తండ్రికి నిప్పుపెట్టి చంపేసిన రాక్షసి కుమార్తెలు
కాగా దారుణానికి పాల్పడింది మొదటి కూతురుగా పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులుకు మొదటి భార్య చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు కలగగా వృద్ధ్యాప్యంలో అతడిని సక్రమంగా చూసుకోకపోవడంతో వృ
డబ్బు ఎంతటి దారుణాలకైనా దారి తీస్తుందని మరో సంఘటన నిరూపించింది. అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసి.. అత్తారింటికి పంపించిన కన్న తండ్రిని ఇద్దరు కుమార్తెలు దారుణానికి ఒడిగట్టారు. తండ్రిని ఇంట్లో ఉంచేసి ఇంటికి నిప్పు పెట్టారు. మంటల్లో కన్న తండ్రి సజీవ దహనమవుతున్నా వారిలో కనికరం రాలేదు. ఆస్తి కోసం తండ్రిని దారుణ హత్యకు పాల్పడిన సంఘటన తెలంగాణ (Telangana)లో చోటుచేసుకుంది. పోలీసుల (Police) కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
కామారెడ్డి జిల్లా (Kamareddy District) రాజంపేట (Rajampet)లో కొప్పుల ఆంజనేయులు (75) (Koppula Anjaneyulu)కు ముగ్గురు కుమార్తెలు. వారికి పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపారు. అయితే తండ్రితో కుమార్తెలు ఆస్తిపై గొడవ పడుతున్నారు. అయితే ఇటీవల ఆంజనేయులు ఒక ఎకరం పొలం విక్రయించాడు. అమ్మగా వచ్చిన రూ.పది లక్షలు తమకు ఇవ్వాలని కుమార్తెలు డిమాండ్ చేశారు. దీనికి తండ్రి ససేమిరా అన్నాడు. తమకు ఆస్తి ఇవ్వకపోవడంపై వారిద్దరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఎలాగైనా తండ్రిని చంపేయాలని కుట్ర పన్నారు.
ఈ సమయంలో సోమవారం తండ్రి ఇంట్లో ఒక్కడే ఉన్నాడని గ్రహించింది. వెంటనే ఇంటికొచ్చి బయట నుంచి గడియ పెట్టి తాళం వేసింది. అనంతరం ఇంటికి నిప్పు పెట్టేసింది. మంటలు వ్యాపించడంతో ఇంట్లో ఉన్న ఆంజనేయులు హాహాకారాలు చేస్తూ కాపాడండి అంటూ అరుస్తూ ఉన్నాడు. అతడి హాహాకారాలు ఆ కఠిన హృదయం కలిగిన కూతురుని కరిగించలేకపోయాయి. మంటల్లోనే తండ్రి ఆంజనేయులు కాలి బూడిదయ్యాడు. అయితే మంటలు అంటుకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకుని మంటలు ఆర్పివేయగా తండ్రి అగ్నికి ఆహుతయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ దారుణానికి ఆమె కుమారుడు కూడా సహకరించాడు.
కాగా దారుణానికి పాల్పడింది మొదటి కూతురుగా పోలీసులు భావిస్తున్నారు. ఆంజనేయులుకు మొదటి భార్య చనిపోయింది. ఆమెకు ఇద్దరు కూతుర్లు కలగగా వృద్ధ్యాప్యంలో అతడిని సక్రమంగా చూసుకోకపోవడంతో ఆయన రెండో వివాహం చేసుకున్నాడు. రెండో భార్యకు ఒక కుమార్తె జన్మించింది. అయితే ఆస్తి మొత్తం రెండో భార్యకు ఇస్తాడని భావించిన కుమార్తెలు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. ఈ దారుణానికి ఒడిగట్టిన కూతుర్లు, మనవడిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తున్నది. కాగా ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.