»Palakurthi After Kcr Im Only The Senior Leader Says Errabelli Dayakar Rao
KCR తర్వాత నేనే సీనియర్: మంత్రి ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు
30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు చూస్తుంటే మంత్రి కేటీఆర్ కు పోటీగా వస్తున్నారా అనే సందేహం ఏర్పడుతుంది. కాగా ఎర్రబెల్లి సరదాగా తన గొప్పతనం చెప్పుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని.. పార్టీలో నంబర్ -2 కోసం కాదని తేలడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ (BRS Party) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (K Chandrashekar Rao) తర్వాత తానే సీనియర్ (Senior Politician) నాయకుడిని అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు చూస్తుంటే మంత్రి కేటీఆర్ కు పోటీగా వస్తున్నారా అనే సందేహం ఏర్పడుతుంది. కాగా ఎర్రబెల్లి సరదాగా తన గొప్పతనం చెప్పుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేశారని.. పార్టీలో నంబర్ -2 కోసం కాదని తేలడంతో పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు.
వరంగల్ జిల్లా (Warangal District) పర్వతగిరి (Parvatagiri) ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1987-88 పదో తరగతి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం నిర్వహించారు. ఆ సంవత్సరం ఆ పాఠశాలలో పదో తరగతి చదివిన వారిలో మంత్రి ఎర్రబెల్లి కూడా ఉన్నారు. దీంతో పూర్వ విద్యార్థిగా మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా తన స్నేహితులను సరదాగా గడిపారు. నాటి సంఘటనలను గుర్తుంచుకుని తన చిన్నతనాన్ని నెమరు వేసుకున్నారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘ఎవరు ఏ రంగంలో రాణించాలంటే కృషి, పట్టుదల రెండూ అవసరం. నేను ఆటల్లో, చదువులో ముందుండే వాడిని. ఎన్నో బహుమతులను గెలుచుకున్నా. రాజకీయాల్లోకి నా తండ్రి ప్రోత్సాహంతో వచ్చా. రాజకీయాల్లో విజయం సాధించాలనే కసి, పట్టుదలతో నేడు ఈ స్థాయికి వచ్చాను. సీఎం కేసీఆర్ తర్వాత నేనే సీనియర్ నాయకుడిని. మొత్తం ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ఒకసారి లోక్ సభ సభ్యుడిగా కూడా విజయం సాధించా. ప్రజల ఆదరణ, అభిమానం కారణంగా 30 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపాడు.
1982లో తెలుగుదేశం పార్టీతో ఎర్రబెల్లి రాజకీయ జీవితం ప్రారంభమైంది. అప్పట్లో కేసీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీలో కలిసి పని చేశారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ బయటకు రాగా.. ఎర్రబెల్లి ఆ పార్టీలోనే కొనసాగారు. 2016లో నాటి టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో కారు గుర్తుపైనే గెలిచారు. పాలకుర్తి (Palakurthi), వర్ధన్నపేటగా హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు. సుదీర్ఘ కాలం పాటు ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రి పదవి మాత్రం రాలేదు. 2019లో సీఎం కేసీఆర్ ఎర్రబెల్లికి మంత్రి బాధ్యతలు అప్పగించారు. 25 ఏళ్ల తర్వాత ఆయనకు మంత్రి పదవి దక్కింది. ఆ సందర్భంగా ఎర్రబెల్లి కొంత ఉద్వేగానికి లోనయ్యారు. ఎమ్మెల్యేగా డబుల్ హ్యాట్రిక్ సాధించిన అతి కొద్దిమంది నాయకుల్లో ఎర్రబెల్లి ఒకరు.