మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు మరోసారి తన నోటి దూలను ప్రదర్శించారు. తనకు ఓటేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పారు. పార్టీ కార్యకర్తలు, వారి పిల్లలకు నౌకరీ పెట్టిస్తామని సభలో ప్రకటన చేసి.. దుమారం రేపారు.
Minister Errabelli: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీగా ఉన్నారు. ఓటరు దేవుళ్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పిస్తున్నారు. కొందరు నేతలు తడబడుతున్నారు. మరికొందరు నాలిక కరచుకుంటున్నారు. అలాంటి వారిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు (Minister Errabelli dayakara rao) ఉంటారు. ఆవేశం కోల్పోయి, ఉద్వేగానికి గురై ప్రసంగిస్తూ ఉంటారు. ఇదే విషయం పలుసార్లు రుజువు అయ్యింది. ఆ వీడియోలు మనం చూశాం.. ఇప్పుడు మరోసారి అలానే చేశారు.
పాలకుర్తి (palakurthy) నుంచి ఎర్రబెల్లి ( Errabelli) బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి బలమైన అభ్యర్థి ఉన్నారు. ఈ సారి విజయంపై కాస్తా అనుమానంతో ఉన్నాడు. ఇంకేముంది ఓ సభలో ఓటర్లు తనకు ఓటు వేయాలని కోరారు. తనకు ఓటు వేస్తేనే జాబ్స్, ఇతర ప్రయోజనాలను కల్పిస్తానని స్పష్టంచేశారు. ఈ వైపు వస్తే.. మిగతా పార్టీల ప్రచారానికి కూడా వెళ్లొద్దని తెగేసి చెప్పారు. ఆ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
అంతకుముందు వర్ధన్నపేట ఎమ్మెల్యేగా (mla) ఉన్న సమయంలో ఊరూరా జాబ్స్ ఇప్పించానని ఎర్రబెల్లి చెప్పారు. పార్టీ, కార్యకర్తలు చూడలేదని.. జనరల్‌గా ఇప్పించానని వివరించారు. ఇక ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. కార్యకర్తలు, వారి పిల్లలకు మాత్రమే జాబ్స్ ఇప్పిస్తానని తేల్చిచెప్పారు. దీంతోపాటు తనకు ఓటు వేసిన వారికి మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తానని వెల్లడించారు. తన వెంట ఉంటే, ఇటే ఉండాలని.. అటు, ఇటు వెళ్లొద్దని కోరారు.
ఎర్రబెల్లి (Errabelli) చేసిన కామెంట్స్ చర్చకు దారితీశాయి. ఏంటీ ఓటేస్తేనే ఉద్యోగాలు.. ఇస్తావా..? లేదంటే ఇవ్వారా అని నెటిజన్లు ఏకీపారేస్తున్నారు. కార్యకర్తలు, వారి పిల్లలు ఓకే.. మరీ మీకే ఓటేశామనే విషయం ఎలా తెలుసుకుంటారని అడిగారు. ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు.